వందో టెస్టు ఆడుతున్న సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను వినియోగించుకునే విషయంలో కెప్టెన్ ధోనిని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తప్పుపట్టాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భజ్జీ కే వలం 25 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. మరోవైపు జడేజా 36 ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. హర్భజన్ ఓ దశలో 200 నిమిషాలపాటు బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. తొలి రోజు టీ విరామానికి 20 నిమిషాల ముందు తన చివరి ఓవర్ వేశాడు. సిడెల్ వికెట్ తీసిన అనంతరం మరో ఓవర్ వేశాక తిరిగి బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు. అలాగే ఇంగ్లండ్‌తో ముంబైలో జరిగిన టెస్టులో కూడా అశ్విన్, ఓజాలకన్నా సగం ఓవర్లే బౌలింగ్ చేశాడు. ‘ధోని వ్యూహాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. జట్టులోని స్పిన్నర్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో శుక్రవారం టీ సమయం నుంచి భజ్జీని బౌలింగ్‌కు దూరంగా ఉంచడం నిజంగా దారుణం. ఏ బౌలర్ విషయంలో బ్యాట్స్‌మన్ ఇబ్బంది పడుతున్నాడో కెప్టెన్‌కు తెలిసి ఉండాలి.
ఇలాంటి వ్యూహంతో హర్భజన్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. తన సామర్థ్యాన్ని కెప్టెన్ నమ్మడం లేదని అతడికి తెలిసిపోయింది. అలాగే రిథమ్‌ను అందుకునేందుకు తనకు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. మున్ముందు కీలక పాత్ర పోషిస్తాడనే నమ్మకం ఉంది. అందుకే భజ్జీకి ఆత్మవిశ్వాసం కలిగించాలి. బౌలింగ్ అవకాశం ఇవ్వకపోతే అతడికి తప్పుడు సంకేతాలు పంపినట్టవుతుంది. తనేమీ కొత్త బౌలర్ కాదు. వందో టెస్టు ఆడుతున్నాడు. కాస్త ధైర్యాన్ని అందిస్తే జట్టుకు సహాయపడగలడు’ అని స్టార్ క్రికెట్ కామెంటరీలో లక్ష్మణ్ అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more