టి-20 ప్రపంచ కప్ గ్రూప్ దశ నేటితో ముగుస్తోంది. కీలక సూపర్-8 సమరానికి తెరలేవనుంది. టీమిండియాకిక అన్నీ సవాళ్లే. నాకౌట్ చేరాలంటే ప్రతీ మ్యాచ్, రన్‌రేట్ అన్నీ కీలకమే. గ్రూప్ దశలో మాదిరిగా ఆషామాషీ ప్రత్యర్థులు కాదు. పటిష్టమైన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఎదురుపడ్డాయి. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో పోరూ దాదాపు ఖాయం అయింది.. రసవత్తర పోరులో సెమీస్ చేరేది రెండు జట్లే కనుక ధోనీసేన బెర్తు సొంతం చేసుకోవాలంటే చెలరేగాల్సిందే. గ్రూప్ దశలో సంచలనాలేమీ నమోదు కాలేదు.
పసికూనలు ఇంటిదారి పట్టగా, టాప్ జట్లు సూపర్-8 చేరాయి. సూపర్-8 దశలో..లీగ్ దశనుంచి వచ్చిన 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. రెండు విజయాలతో గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచిన టీమిండియా.. సూపర్-8 పోరులో గ్రూప్- 2లో ఆడనుంది. ఇదే గ్రూప్‌లో బలమైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. బెర్తు సాదించిన పాక్ కూడా ఇదే గ్రూప్‌లో ఉంది. ఇ క గ్రూప్-1లో ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఉ న్నా యి. ఒక్కో గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తా యి. గ్రూపు-1తో పోలిస్తే గ్రూప్-2 పోరే క్లిష్టంగా కనిపిస్తోంది. సూపర్ పోరులో ధోనీసేన.. ఆసీస్, సౌతాఫ్రికా, పాక్ తో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. నాకౌట్ చేరాలంటే కనీసం రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. పొట్టి కప్‌లో దాయాదాల పోరు అభిమానులకు కనుల పండుగే.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more