క్లిష్ట పరిస్థితుల్లో వీరోచిత ఇన్నింగ్స్‌తో యువ భారత జట్టును అండర్-19 చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌లో అసాధారణ ప్రతిభ దాగుందని అతని కోచ్ సంజయ్ భరద్వాజ్ అంటున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ఓపెనర్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ కూడా సంజయ్ శిక్షణలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. అయితే ఈ ఇద్దరు ప్రియ శిష్యులను ఒకరితో ఒకరిని పోల్చడం కష్టమే అంటున్న భరద్వాజ్.. ఉన్ముక్త్ మాత్రం గంభీర్‌కన్నా ప్రతిభావంతమైన ఆటగాడని కితాబిచ్చాడు. 'ఉన్ముక్త్ ప్రతిభతోపాటు కష్టపడే తత్వం కలబోసిన ఆటగాడు.అతని కెరీర్ గ్రాఫ్ చూస్తే అది అర్థమవుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ రెండు చేతుల్తో అందిపుచ్చుకుంటాడు. గంభీర్ అద్భుతమైన ఆటగాడే అయినా..
ఈ వయసులో ఉన్ముక్త్ అంత ప్రతిభ కనబర్చలేదు. అయితే ఈ ఇద్దరికీ కోచ్‌గా వ్యవహరించినందుకు చాలా గర్వంగా ఉంది. వాళ్ల ఆటతీరు మెరుగయ్యేందుకు సలహాలు మాత్రమే ఇచ్చాను. వారిలోని అంకితభావం, పట్టుదలే వారిని ఈ స్థాయికి చేర్చాయి' అని భరద్వాజ్ అన్నాడు. ఉన్ముక్త్‌కు సీనియర్ జట్టులో చాన్స్‌పై స్పందిస్తూ.. 'వచ్చే ఏడాది ఆరంభానికల్లా ఉన్ముక్త్ జాతీయ జట్టులో ఉండొచ్చు. అయితే అంతకంటే ముందు అతడు మరింత నిరూపించుకోవాలి. నిలకడ ప్రదర్శించాల్సి ఉంద'ని చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more