ఊపిరితిత్తుల మధ్య క్యాన్సర్ కణితికి అమెరికాలో కీమోతెరపి తీసుకుంటున్న యువరాజ్ సింగ్‌ను అనిల్ కుంబ్లే పరామర్శించాడు. ఈ విషయాన్ని యువీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కుంబ్లే రావడం తనలో ఎంతో ధైర్యాన్ని నింపిందని యువీ అన్నాడు. కుంబ్లే వస్తాడని తాను కలలో కూడా ఊహించలేదని, అతని రాక తనను ఎంతో ఆనందానికి గురిచేసిందన్నాడు. తాను గౌరవించే కుంబ్లే తనను పరామర్శించడానికి రావడంపై యువీ సంతోషం వ్యక్తం చేశాడు. జంబో(కుంబ్లే)తో రోజంతా గడిపాను నాకిది గొప్ప ప్రేరణ అని యువీ ఫొటోలతో సహా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. గతవారంలో అలాగే తన స్నేహితుడు, నటుడు రణ్‌విజయ్ సింగ్ కూడా ఈ విధంగానే యువీ దగ్గరకు వెళ్లి పరామర్శించాడు. ఇద్దరూ కలిసి 'అందాజ్ అప్నా అప్నా' మూవీ చూశామని యువీ అన్నాడు. క్యాన్సర్ కణితికి కీమోతెరపీ తీసుకుంటున్న యువీ ఆరోగ్యం రోజురోజుకూ కుదుటపడుతోంది. తొలి దశ కీమోతెరపీ తర్వాత కణితి దాదాపు పోయిందని అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్ లారెన్స్ రిపోర్టు ఇచ్చాడు. ఇప్పుడు రెండో దశ కీమోతెరపీ జరుగుతోంది. మార్చి చివరి కల్లా యువీ కీమోతెరపీ ముగుస్తుందని మే నెల లోపు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more