గుత్తి కోట
ఏపీలోని అనంతపురం జిల్లాలో గుత్తి పట్టణానికి సమీపంలో ఈ కోట వుంది. రాయలసీమలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన ఈ కోటకు శతాబ్దాల చరిత్ర వుంది. క్రీస్తు పూర్వమే ఇక్కడ జనావాసం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. అశ్వాలు, ఏనుగులు నీరు తాగటానికి పెద్ద బావి కూడా వుంది. ప్రజల తాగునీటి అవసరాలను గమనించిన రాజులు దుర్గంలో 101 బావులను తవ్వించారు.