భువనగిరి కోట
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఈ కోట వుంది. కాకతీయుల కాలంలో ఏకశిల రాతి గుట్టపై విక్రమాదిత్యచే నిర్మించబడింది. ఎత్తైన గోడలు, విశాలమైన గదులు ఇస్లాం సంస్కృతి నిర్మాణ శైలిలో ఉన్నాయి. నల్లని నంది విగ్రహం, ఆంజనేయుని శిల్పం, అంతు తెలియని రహస్య శిలాగర్భ మార్గాలు ఉన్నాయి.