ఎలగందల్ కోట
కరీంనగర్ కి 15 కి. మీ. దూరంలో ఉన్న ఎలగందల్ గ్రామంలో ఈ పురాతనమైన కోట ఉంది. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందరమైన ప్రకృతి నడుమ ఎత్తైన కొండ మీద ఎలగందల్ కోట నిర్మించబడి ఉంది.