చంద్రఘడ్ కోట
మహబూబ్ నగర్ జిల్లాలో ఉన చంద్రఘడ్ గ్రామంలో ఎత్తైన కొండ మీద రెండంచెలుగా చంద్రఘడ్ కోటను నిర్మించారు. చుట్టుప్రక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నుంచి చూసిన ఈ కోట కనిపిస్తుంది. కోట మొత్తం కూడా రాళ్లతో నిర్మించడం విశేషం. కొండమీద ఉన్న 8 నీటి ఊటలు ఇప్పటికీ స్వచ్ఛమైన నీటిని కలిగి ఉండి, సమీప గ్రామాలకు త్రాగునీటి అవసరాలను తీరుస్తున్నాయి.