హనీ
చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచే తేనె.. ముఖం మీద ఏర్పడ్డ మచ్చలను తొలగించడంతోపాటు చర్మంలో ఏదేని ఇన్ఫెక్షన్ ఉన్నా నివారిస్తుంది. ఇది మంచి మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగపడుతుంది. రెండు టీ స్సూన్ల తేనెలో ఒక టీస్పూన్ నిమ్మరసం చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే ఫలితం లభిస్తుంది.