రోలింగ్ స్టోన్ మ్యాగజైన్
1993వ సంవత్సరంలో రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ తిరిగి మరో సంచలనమైన కవర్ పేజీతో వార్తల్లోకెక్కింది. ఒక వ్యక్తి జానెట్ జ్యాక్సన్ ఎదలను తాకుతూ తీసిన ఒక ఫోటోను రోలింగ్ స్టోన్ తన కవర్ పేజీ మీద ప్రచురించింది, ప్రయోగాత్మకమైన సంచలనాన్ని సృష్టించింది. ఆడవాళ్లను ఈ విధంగా నగ్నంగా చూపించడమే గాకుండా, ఇంత అసభ్యకరమైన పద్ధతిలో ప్రచురించినందుకు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. దీనికి సంబంధించి అప్పట్లో చాలా సంఘర్షణలు కూడా జరిగాయి.