My father veelunama is correct

veelunama correct or wrong, father veelunama,

veelunama correct or wrong, father veelunama,

మా నాన్న రాసిన వీలునామా సక్రమమేనా ?

Posted: 04/12/2014 04:55 PM IST
My father veelunama is correct

మేము నలుగురం అన్నదమ్ములం. నేను రెండవ వాణ్ని, మాకు చెళ్లెల్లు లేరు. మా నాన్నగారు సుమారు ఆరేళ్ల క్రితం ఒక వీలునామా రాయించి రిజిస్టర్ చేయించారు. ఆ తరువాత ఆరు మాసాలకే ఆయన మరణించారు. మా నాన్నగారు తన స్వార్జితమైన పెద్ద భవనంలో మేడ మీదున్న ఐదు పోర్షన్లలో మా అన్నదమ్ముల్లో నలుగురికీ ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. అలాగే మా కింది అంతస్తులో మాకు వాటా ఉంటుందో లేదో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఇకపోతే,తన పిత్రార్జితమైన 0.55 సెంట్ల ఖాళీ స్థలంలోనూ మా నలుగురికీ సమాన హక్కులు కల్పించారు. అయితే, వీలునామాలో మేడ మీద మా అన్న కు ఇచ్చిన పోర్షన్‌లో ఇంటినెంబరుగా 13/99 గా పేర్కొన్నారు. నిజానికి మా కుంటుంబంలో ఈ ఇంటి నెంబరు ఎవరికి సంబంధించినదీ కాదు. పైగా మా నలుగురికీ ఇచ్చిన ఇళ్ల స్థలం విస్తీర్ణమెంతో వీలునామాలో ఎక్కడా పేర్కొనలేదు. ఈ విషయం అలా ఉంచితే, మానాన్న పిత్రార్జితమైన 0.55 సెంట్ల భూమి మీద మా నాన్న గారి చిన్నాన్న కూతురు తన హక్కుకోసం దావా వేసి గెలుపొందారు. వాస్తవానికి మా నాన్న వీలునామా రాయకముందే ఈ తీర్పు వచ్చింది. అయినా మా నాన్న ఆ విషయాన్ని తన వీలునామాలో ఎక్కడా ప్రస్తావించకుండా ఆ 0. 55 సెంట్ల భూమి మీద మాకు సమాన హక్కులు కల్పించారు. పైగా అన్ని ఇళ్లకూ సంయుక్తంగా, ఒకే ఒక్క నీటి సదుపాయంగా ఉన్న బోర్ నాలుగవ కుమారుడికే చెందాలని వీలునామాలో రాశాడు. ఈ విషయాలన్నీ పరిశీలించిన తరువాత అసలు ఈ వీలునామా సక్రమమేనా? ఇది మా నాన్న రాసిందేనా? అన్న అనుమానం కలుగుతోంది. ఈ స్థితిలో మాకు రావలసిన వాటాల విషయంలో మేము అనుసరించవలసిన మార్గమేమిటో తెలియచేయండి.

ఎవరైనా, తాను ఎవరి ఒత్తిళ్లకూ, ప్రలోభాలకూ లోబడకుండా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి, తనకు తానుగా వీలునామా రాసినట్లయితే, ఆ వీలునామా చెల్లుతుంది. ఒక వేళ ఇందుకు విరుద్ధంగా ఎవరి ఒత్తిళ్లకో, ప్రలోభాలకో లోబడి వీలునామా రాసి ఉంటే, ఆ వీలునామాను కోర్టులో సవాలు చేయవలసి ఉంటుంది. ఇక మీ విషయంలో చూస్తే మీ నాన్నగారు, తనకు తెలిసిన విషయాలను కూడా, ఆ వీలునామాలో పొందుపరచకుండా, వేరే వాళ్లకు లాభం చేకూరే విధంగా రాసినట్లు అనుమానం కలుగుతోంది. ఈ కారణంగా, ఆ వీలునామా సరియైనది కాదని తెలియచేస్తూ, మీ నాన్నగారి స్వార్జితమైన ఆస్తిలో, వీలునామా రాయకుండానే చనిపోయినట్లుగా భావిస్తూ, ఆ ఆస్తిని వారసులందరికీ సమానంగా, వాటాలు చెందేలా పార్టీషన్‌కై దావా వేయండి. ఇక్కడ రెండు ప్రధాన విషయాలు ఉంటాయి. ఒకటి మీ నాన్న గారు రాసిన వీలునామా సరియైనది కాదని మీరైనా నిరూపించాలి. , లేదా, ఆ వీలునామా ఆధారంగా ఆస్తులను అనుభ వించాలని చూస్తున్న వారైనా ఆ వీలునామా నిజమైనదేనని రుజువుచేయగలగాలి. ఒకవేళ మీనాన్న ఆ వీలునామాను మనస్పూర్తిగా రాసింది కాదని మీరు రుజువు చేసినట్లయితే, ఆ వీలునామాను రద్దుపరిచి, మీ నాన్నగారి వారసులందరికీ ఆస్తిలో సమాన హక్కులు లభించేలా కోర్టు తీర్పు ఇస్తుంది.

మీరు చెప్పిన విషయాలను పరిశీలిస్తే, మీ నాన్నగారి పిత్రార్జితమైన 0.55 సెంట్ల భూమిని, మీ నాన్నగారు వీలునామా రాయకముందే, ఆయన చిన్నాన్న కూతురు, జిల్లా కోర్టు నుంచి, డిగ్రీపొందినప్పటికీ, ఆ విషయాన్ని విస్మరించి, ఆ మొత్తం భూమిని మీ నలుగురికీ సమానంగా రాయడంలో మీనాన్న గారి విచక్షణాపరమైన లోపాలు కనిపిస్తున్నాయి. ఇంటి నంబరే కాకుండా, మరికొన్ని ఇతర విషయాలు కూడా వాస్తవాలకు విరుద్ధంగా ఉండడ ం వల్ల ఆ విషయాలన్నిటినీ, కోర్టు దృష్టికి తీసుకు వెళ్లవలసి ఉంటుంది. కాకపోతే ఈ చిన్నచిన్న కారణాల ఆధారంగా ఆ వీలునామాను మీ నాన్నగారు రాయలేదని రుజువు చేయడం కష్టం. ఆ వీలునామా మీ నాన్నగారే రాశారా? ఆ రాసే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే విషయాలపై స్పష్టత ముఖ్యం. ఒకవేళ ఆ వీలునామా రాసే సమయంలో అతడు శారీరకంగానో మానసికంగానో అనారోగ్యంతో ఉంటే ఆ విషయాల్ని డాక్టర్ సర్టిఫికెట్ ఆధారంగా మీరు రుజువు పరచగలగాలి. ఆ వీలునామాను మీ నాన్నగారు స్వయంగా రాయలేదని, వేరే వ్యక్తి ఎవరో తన స్వార్థంతో, ఆయనను ప్రేరేపించి రాయించుకున్నట్లుగా, మీరు నిజంగా నిరూపిస్తే, మీ నాన్న ఆస్తిలో కచ్ఛితంగా మీకు న్యాయమైన వాటా వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles