• చిత్రం  :

    అనుకోలేదు

  • బ్యానర్  :

    శారదా సబూరి ప్రాజెక్ట్, రన్ వే రీల్

  • దర్శకుడు  :

    శశి

  • నిర్మాత  :

    రాజేష్ వర్రె

  • సంగీతం  :

    గోకుల్ ఏక్ నాథ్

  • ఛాయాగ్రహణం  :

    శశి

  • ఎడిటర్  :

    వీణా ఉప్పలపాటి

  • నటినటులు  :

    రవి కిరణ్, పూర్ణిమ, అన్ను పాండే, క్రిష్ట చైతన్య కొక్కు, జై

Anukoledu Telugu Short Film Review
Cinema Story

అర్జున్, పూర్ణి.. ఇద్దరు మంచి ఫ్రెండ్స్.. ప్రతిఒక్క పనిలోనూ ఇద్దరు షేర్ చేసుకుంటుంటారు... అందరిలాగే పార్కులకు, షికార్లకు వెళుతుంటారు. అలా హ్యాపీగా సాగుతున్న వారి ఫ్రెండ్ షిప్ లైఫ్ లో అనుకోకుండా ప్రేమ పుడుతుంది. పూర్ణి, అర్జున్ ను ఎంతగానో ప్రేమిస్తుంటుంది. కానీ అర్జున్ మాత్రం తమ మధ్య వున్నది మంచి ఫ్రెండ్ షిప్ అంటూ తన స్నేహితులతో చెబుతుంటాడు. అయితే అర్జున్ కి అమ్మాయిల్లో చాలామంది ఫ్రెండ్స్ వుంటారు. అతను తన ఫ్రెండ్స్ తో వున్నప్పుడు చూసి చాలా నిరాశకు గురవుతుంది.

ఈ నిరాశతోనే తన మనసులో వున్న ప్రేమను అర్జున్ కు వ్యక్తపరచాలని నిర్ణయించుకుంటుంది. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటుంది. మరి.. అర్జున్ ఆ అమ్మాయి లవ్ ను ఆక్సెప్ట్ చేస్తాడా..? లేదా..? చివరకు ఏమవుతుంది..? అర్జున్ మనసులో మరెవరైనా వున్నారా..? ఇంతకు పూర్ణి తన మనసులో మాటను తెలియపరుస్తుందా..? లేదా..? అన్న కోణంలో ఈ షార్ట్ ఫిలింను రూపొందించారు.

cinima-reviews
అనుకోలేదు

ప్రస్తుతకాలంలో వున్న యువతీయువకులందరికీ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అంటే లవర్స్ వుండటం సహజం. మొదట్లో ఫ్రెండ్స్ గా పరిచయమై ఆ తర్వాత అనుకోకుండా ప్రేమలో పడిపోవడం.. ఆ తర్వాత వ్యవహారాలు అందరికీ తెలిసిందే! అయితే కొంతమంది మాత్రం ఫ్రెండ్ షిప్ కు చాలా వ్యాల్యూ ఇస్తారు. అమ్మాయిలు - అబ్బాయిల మధ్య అనుబంధం కూడా మంచిదని భావిస్తూ ఫ్రెండ్ షిప్ కే ఎక్కువ వ్యాల్యూ ఇస్తుంటారు. అయితే అటువంటి వారి మధ్య పుట్టే లవ్ ను ఎక్స్ ప్రెస్ చేయడంలో ఇద్దరు తడబడతారు. ఇతరులతో కూడా తమ ఫీలింగ్స్ షేర్ చేసుకోరు. బహుశా అటువంటివారిని ఉద్దేశించే.. ‘‘అనుకోలేదు’’ అనే షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించారేమో!