• చిత్రం  :

    నన్య.. ద సౌల్ ఫ్యాక్టరీ

  • బ్యానర్  :

    ద సౌల్ ఫ్యాక్టరీ

  • దర్శకుడు  :

    రుగ్వేద్ మోండ్కర్

  • నిర్మాత  :

    అర్చన పండిట్

  • ఛాయాగ్రహణం  :

    సయాక్ భట్టాచార్య

  • ఎడిటర్  :

    జిగ్నేష్ గోహిల్

  • నటినటులు  :

    ఆకాంక్ష, చిన్మయి సుమిత్, అజయ్ నికితె

Ananya The Soul Factory Short Film Movie Review

విడుదల తేది :

Nov 26 2014

Cinema Story

నిశ్చితార్థం జరిగిన తర్వాత అబ్బాయి బ్రేకప్ చెప్పడంతో తీవ్రమనస్తాపానికి గురైన అమ్మాయి.. తన బెడ్’రూమ్’లో ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఇక ఎంగేజ్’మెంట్ తెగిపోయిందనే బాధలో వున్న తల్లిదండ్రులు తమ కూతుర్ని ఓదార్చుదామనే ఉద్దేశంతో బెడ్’రూమ్ తలుపులు తడతారు. అయితే ఎంతసేపటికి అమ్మాయి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి.. తాళం తీస్తారు. అంతే! ఫ్యాన్’కు ఉరేసుకున్న తమ అమ్మాయిని చూసి భోరుమని ఏడుస్తూ వుండిపోతారు. ఆత్మగా మారిన ఆ అమ్మాయి తన తల్లిదండ్రులు పడుతున్న బాధల్ని చూస్తూ తాను కలత చెందుతోంది.

తమ కూతురు పోయిందన్న బాధతో ప్రతిరోజూ కుమిలిపోతున్న ఆ తల్లిదండ్రులు చూసి ఆత్మగా మారిన అమ్మాయి తాను చేసిన తప్పును అర్థం చేసుకుంటుంది. అప్పుడు తనలో తాను మాట్లాడుకుంటూ.. ‘‘నిశ్చితార్థం తెగిందన్న బాధతో ఆరోజు రాత్రంతా ఏడ్చివుంటే.. మనసులో వుండే బాధ అంతా వెళ్లిపోయి వుండేది. తర్వాత నా తల్లిదండ్రులు మరో అబ్బాయితో ఖచ్చితంగా పెళ్లి చేసిచ్చేవారు. కానీ నేనలా ఆలోచించకుండా అనవసరంగా తొందరపడి ఆత్మహత్యకు పాల్పడ్డాను. ప్రతిరోజూ అమ్మనాన్నలను చంపుతున్నాను’’ అని ఫీల్ అవుతుంది.

cinima-reviews
అనన్య.. ద సౌల్ ఫ్యాక్టరీ

ప్రేమ లేదా పెళ్లిబంధాలు తెగిపోయాయన్న కారణంతో తీవ్రమనస్తానికి గురవుతున్న అమ్మాయిలు ముందూవెనుక ఆలోచించకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాము చనిపోతే ఆ తర్వాత తమ కుటుంబం పడే బాధలు, అవస్థలు అర్థం చేసుకోకుండా తొందరపడుతున్నారు. సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులతో కలిసి వాటిని పరిష్కరించాల్సిందిపోయి.. పిరికిదనంతో తమ ప్రాణాలనే బలైపోతున్నారు.

కానీ అలా ఆత్మహత్య చేసుకోవడంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటే చాలా పెద్ద తప్పు. అలా చేస్తే తమని తాము బలిచేసుకోవడంతోబాటు తమ కుటుంబాన్ని చంపేసినట్లే లెక్క! తమ కూతురు లేదన్న ప్రతిరోజూ కుటుంబసభ్యులు ఏడుస్తూనే కుమిలిపోతూ చస్తుంటారు. ఒక్క క్షణంలో అమ్మాయిలు ప్రాణం తీసుకోవచ్చుకానీ.. కుటుంబసభ్యులు మాత్ర ప్రతిక్షణ చస్తూనే వుంటారు. కాబట్టి తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులతో వాటిని పరిష్కరించే మార్గాల్ని వెదుక్కుంటే అందరూ సుఖంగా వుండొచ్చు.