రామ్ చరణ్ సినిమాలకు కాలం కలిసి రావడం లేదు. తాను బాలీవుడ్ లో నటించిన ‘జంజీర్ ’ సినిమా కు అనేక అవాంతరాలు, అడ్డంకులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అతను టాలీవుడ్ లో నటించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన ‘ఎవడు ’ సినిమా కూడా ఈ వారం అంటే 31వ తేదీన విడుదల కావాల్సి ఉన్నా, తీరా అదికాస్త వాయిదా పడింది. ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడటానికి సినిమా వర్గాల నుండి అనేక కారణాలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ అంశం మళ్లీ వేడెక్కింది. అధిష్టానం ఈనెల 1, 2 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో ఆందోళనలు మిన్నంటి సినిమాకు సమస్యలు తలెత్తుతాయని భావించి ఆగష్టు 21వ తేదీని ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారని అధికారిక సినీ వర్గాల సమాచారం. కానీ ఈ సినిమా విడుదలకు మరో కారణం ఉందని అంటున్నారు. ఈ సినిమా తరువాత వారం రోజులకే పవన్ సినిమా విడుదలకు సిద్ధమైన నేపధ్యంలో సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంటే రెండో వారం నుండి సినిమా కలెక్షన్లు పూర్తిగా పడిపోతాయని, ఎన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసినా కనీసం రెండు వారాలు ఆడితే గానీ పెట్టిన పెట్టుబడి రాదని భావించి నిర్మాత వాయిదా వేశాడని ఇన్ సైడ్ టాక్. మరో మాట ఏంటంటే... అత్తారింటికి యావరేజ్ ఫిలిం అయితే తరువాత ‘ఎవడు ’ కి మంచి వసూళ్ళు వస్తాయని కూడా భావించి వాయిదా వేసినట్లు చెప్పుకుంటున్నారు. మరి ఆరోజు అయినా ఈ సినిమాను విడుదల చేస్తారో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more