Teluguwishesh 4.gif 4.gif srikanth lucky movie review by teluguwishesh.com Product #: 39294 stars, based on 1 reviews
  • Movie Reviews

    lucky-movie-_innereeచిత్రం పేరు : ‘లక్కీ’
    విడుదల తేదీ: 01నవంబర్ 2012

    దర్శకుడు : హరి
    నిర్మాత : రాజ రాజేశ్వరి, శ్రీనివాస్ రెడ్డి
    సంగీతం : సాయి కార్తీక్
    నటీనటులు : శ్రీ కాంత్, మేఘనా రాజ్ , బ్రహ్మానందం, రోజా
    తెలుగువిశేష్.కాం రేటింగ్  : 1 . 5

    పరిచయం :

        గతకొంతకాలంగా హీరో శ్రీకాంత్ కు రాహుకాలం నడుస్తున్నట్టుంది. అతని గత వైభవ చిత్రాలు తాజ్ మహల్, పెళ్లి సందడి, ఆహ్వానం వంటివి  కనుచూపుమేరలో కనిపించటంలేదు. పెళ్ళాం ఊరిళితే మూవీలో  కామెడీ ఒలికించి గట్టెక్కినా పూర్తి స్థాయి హిట్స్ దొరక్క కరువాచి కూర్చున్నాడు. ఈ క్రమంలో కొన్ని సినిమాల్లో అతిధి పాత్రలు చేస్తూ వచ్చాడు. ఇలాంటి గడ్డుకాలంలో అయన తాజా సినిమా ‘లక్కీ’ ఇవాళ విడుదలైంది. ఈ మూవీ ద్వారా అయినా శ్రీకి ఏమైనా ఉపశమనం లభిస్తుందేమో చూద్దాం..
    స్టోరీ లైన్ :
        హీరో శ్రీకాంత్(లక్ష్మి నారాయణ అలియాస్ లక్కీ) గోవెల్ వరల్డ్ అనే  ట్రావెల్ ఏజెన్సీ లో వర్క్ చేస్తుంటాడు.   ఇతనికి మొదటినుంచీ ఆడవాళ్లంటే చిరాకు. వీళ్లంతా సోదిబేరం అనుకుంటాడు. ఒకసారి రాజ రాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నదగ్గరనుంచీ లక్కీకి విచిత్రంగా ఆడవాళ్ళు వాళ్ళ మనసులో ఏమనుకున్నా అతనికి ఇట్టే తెలిసిపోతుంటుంది. ఆ అనుగ్రహం వల్ల మొదట్లో వారి మీద కోపం ఇంకాస్థ పెంచుకుంటాడు. డాక్టర్ సత్య (గీత) సలహాతో ఆడవాళ్ళ మనసుని అర్ధం చేసుకోవడం ప్రారంభిస్తాడు. ఇందులో అతని పయనం ఎంతవరకూ వెళ్తుంది... ఇదిలా ఉండగా, తీవ్రవాదులు ప్లాన్ చేసిన హైదరాబాద్ మీద దాడికి, ఇతనికి సంబంధం, వీటిని ఏవిధంగా ఎదుర్కొన్నాడనేదే చిత్ర కథ.
    అనుకూల ప్రతికూలాంశాలు  :
    హీరో శ్రీకాంత్ నటన ఎప్పటిలాగే. కొల’వెర్రి’ తరహాలో ఆయన స్వయంగా ఈ సినిమాలో పాడిన పాట బాగా ఆకట్టుకుంది. ఇక మూడు సంవత్సరాల క్రితం ‘బెండు అప్పారావు’ సినిమాలో సెకండ్ హీరొయిన్ గా కనిపించి మాయమైన మేఘనా రాజ్ మళ్లీ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. తెలుగులో అవకాశాలు రాక మళయాళీ రంగం మీద మగ్గుచూపుతున్న మేఘనకు ఈ చిత్రంలో నటన చాలా పరిమితం. ఆమె కేవలం సాంగ్స్ కే అయిందని చెప్పాలి. లక్కీ.. అతని బాస్ రోజా మధ్య సాగే వేధింపు సన్నివేశాలు కొంతవరకూ రక్కికట్టాయి.
             ఈ చిత్ర దర్శకుడు హరి అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైపోయి టోటల్ గా చెత్త ఔట్ ఇచ్చాడు. ఉగ్రవాదులు దాడి పార్ట్ తేలిపోయింది. లక్కీ తన భార్యని, కుటుంబ సభ్యులని అర్ధం చేసుకునే సన్నివేశాలు పేలవంగా సాగాయి. ఉగ్రవాదులను అడ్డుకునే సీన్స్ మరీ సిల్లీగా ఉన్నాయి. బ్రహ్మానందం సెపరేట్ కామెడీ తో ఒరిగింది గుండుసున్నా.
     టెక్కికల్ టీం వర్క్ :
              సాయి కార్తీక్ సంగీతం మోస్తరుగా సాగింది. శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ అంతంతమాత్రం. నాగిరెడ్డి ఎడిటింగ్ అలానే ఉంది. స్ర్కీన్ ప్లే చాలా సందర్భాల్లో బోర్ అనిపిస్తుంది.
    ముగింపు :
            మగవాళ్ళు ఆడవాళ్ళని అర్ధం చేసుకోవాలంటూ కథ నడిపిన దర్శకుడు ప్రేక్షకుల మనసు అర్థంచేసుకోలేకపోయాడు.

    ...avnk

More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com