రాజన్న సినిమా రివ్వ్యూ....
సంస్థ : అన్నపూర్ణ స్డూడియోస్
నటీనటులు : నాగార్జున, స్నేహ, బేబీ అని, శ్వేతామీనన్, నాజర్, అజయ్, సుప్రీత్, ప్రదీప్‌రావత్,
ముఖేష్‌రుషి, రవి కాలే, హేమ, శకుంతల తదితరులు.
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
యాక్షన్ డైరక్టర్ : ఎస్.ఎస్.రాజమౌళి
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం : శ్యామ్ కే నాయుడు, అనీల్ బండారి మరియు పూర్ణ
నిర్మాత : అక్కినేని నాగార్జున
దర్శకత్వం : విజయేంద్రప్రసాద్
రగడ వంటి కమర్షియల్ హిట్ కొట్టి ఆ తరువాత గగనం వంటి ప్రయోగాత్మక చిత్రం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాగార్జున ప్రముఖ రచయిత మరియు రాజమౌళి తండ్రి గారు అయిన విజయేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో రాజన్న చిత్రం చేసారు. అగ్ర దర్శకుడు రాజమౌళి కీలక సన్నివేశాలకు మరియు యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రేక్షకుల తీర్పు కోరుతూ మన ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.
కథ:
రాజన్న చిత్ర కథ 1950లో ఆదిలాబాద్ జిల్లా లోని నేలకొండపల్లి అనే గ్రామంలో మొదలవుతుంది. నేలకొండపల్లిలో ఉండే మల్లమ్మ (ఏనీ) ని ఒక పెద్దయన అల్లారుముద్దుగా పెంచుతాడు. మల్లమ్మకి పాటలంటే ఎంతో ఇష్టం. మల్లమ్మని బడిలో చేర్పించడానికి ఆ ఊరిలో ఉండే దొరసాని అనుమతి కోసం వెళ్తారు. అక్కడ పాట పాడి దొరసాని ఆగ్రహానికి గురవుతుంది. మళ్లీ పాట పాడితే చంపేస్తానని హుకుం జారీ చేస్తుంది. ఒకానొక సందర్భంలో మల్లమ్మ అనుకోకుండా పాట పాడితే మల్లమ్మని పెంచిన పెద్దాయనని చంపేస్తుంది దొరసాని. మల్లమ్మని కూడా చంపబోతే సంగీతం మాస్టారు (నాజర్) కాపాడతాడు. దొరసాని బాధల నుండి నుండి తన ఊరికి విముక్తి లభించాలంటే డిల్లీలో ఉన్న ప్రధాన మంత్రి నెహ్రు గారి వల్ల మాత్రమే అవుతుంది అని తెలుసుకొని కాలినడకన డిల్లి కి వెళుతుంది. మల్లమ్మ డిల్లీలో ఉన్న విషయం దొరసానికి తెలుసుకుని మల్లమ్మని బందిస్తుంది. దొరసాని నుండి ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో తెలియక ఏడుస్తున్న మల్లమ్మ కి “రాజన్న” వీర గాధ ని సంగీతం మాస్టారు చెబుతాడు. ఇంతకు రాజన్న ఎవరు. ఆయనకి మల్లమ్మకి ఉన్న సంబంధం ఏమిటి. మల్లమ్మ నెహ్రు ని కలిసిందా లేదా అనేది మిగతా చిత్ర కథ.
నటీనటుల నటన గురించి : మొదటగా మనం చెప్పుకోవాల్సింది మల్లమ్మ పాత్రలో నటించిన అన్నీ గురించి. తన నటన అద్బుతం , తన నటన వర్ణనాతీతం తన నటన గురించి చెప్పటానికి మాటలు సరిపోవుటలేదు. ఈ పాత్రకి అన్నీకి ఖచ్చితంగా అవార్డు వస్తుంది అనిపిస్తుంది.తరువాత చెప్పుకోవాల్సింది నాగార్జున గారి గురించి ఇలాంటి చిత్రం కథానుగుణంగా నడిపించటానికి చాలా ధైర్యం కావాలి కథ మీద నమ్మకంతో ఈ ప్రయోగం చేసిన నాగార్జున గారికి అభినందనలు.
మల్లమ్మ పాత్ర చేసిన అన్నీ అద్బుతం గా చేసింది. ముందే చెప్పినట్టు గా తన నటన వర్ణనాతీతం. తన నటనలో చాలా పరిపఖ్వత కనిపించింది. మల్లమ్మ పాత్ర లో హావభావాల ని అద్బుతం గా పలికించింది. తన పాత్ర జనానికి చేరువయ్యేలా చేసింది. మల్లమ్మ ఒక్కొక సమస్యని దాటుతూ వుంటే జనం పాత్ర లో లీనమయిపోతారు.
నాగార్జున రాజన్న పాత్రలో బాగా ఇమిడిపోయారు అయన ఆహార్యం ఆ పాత్ర కి అద్బుతం గా ఉంది . పోరాట సన్నివేశాలలో సంభాషణలను అద్బుతం గా పలికారు. స్నేహ, రాజన్న భార్య లచ్చమ్మ పాత్రలో పరిధి మేరకు బాగానే నటించింది. శ్వేతా మీనన్ దొరసాని పాత్రలో ప్రతినాయిక పాత్ర పోషిచింది. నాజర్ మరియు గాంధీ వాళ్ళ పాత్ర మేరకు నటించారు. దిలావర్ ఖాన్ పాత్రలో సత్య నాగ్ బాగా నటించాడు. ముఖేష్ ఋషి ప్రతినాయకుడి పాత్రలో బాగా చేసారు. హేమ మరియు తెలంగాణ శకుంతల వారి పాత్ర మేరకు బాగా నటించారు. అజయ్,సుప్రీత్,శ్రావణ్ మరియు ప్రదీప్ రావత్ రాజన్న స్నేహితులుగా బాగా నటించారు. శ్యాం.కే.నాయుడు మరియు అనిల్ బండారి ల సినిమాటోగ్రఫీ కనువిందు చేస్తుంది, దృశ్యాలు చాల బాగా వచ్చాయి .కోటగిరి వెంకటేశ్వర రావు గారి ఎడిటింగ్ చాలా బాగుంది. రవీందర్ చేసిన ఆర్ట్ వర్క్ నిజమనిపించేల వుంది.
మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. భారీ అంచనాలతో మాత్రం వెళ్లవద్దు.