పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' సినిమా అంచనాలను మించి హిట్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సృష్టిస్తున్న సునామితో తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ పాయింటుకు చేరుకుంది. ఇక రెండో వారం నుంచి వచ్చే ప్రతీ రూపాయి ఈ చిత్ర నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు లాభాలను అర్జించిపెడుతోందని అనడంలో సందేహమే లేదు. అయితే పవన్ కల్యాణ్ కు అత్తారింటికి దారేది చిత్రం తరువాత దక్కిన ఈ విజయాన్ని ఫ్యాన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా, మంచి లాభాలను రాబట్టేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో వ్యవధిలో ఓటిటీ ఫ్లాట్ ఫామ్ ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి రెడీ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి రీమేక్. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు 90 కోట్ల షేర్ కలెక్షన్లను 160 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ చిత్రం 18 కోట్ల వరకు సాధించాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భీమ్లానాయక్ చిత్రం త్వరలోని ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఈ చిత్రం మార్చి చివరి వారం నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. డిస్నీ+హాట్‌స్టార్, ఆహా సంస్థలు డిజిటల్ హక్కులను కొనుగోలు చేశాయి. ఈ చిత్రంలో పవన్ పోలీస్ అధికారిగా కనిపించగా, రానా ఎక్స్ మిలిటరి ఆఫీసర్‌గా నటించాడు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్‌ప్లే అందించాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్ర హిందీ ట్రైలర్ తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more