పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్లో 'భీమ్లా నాయక్' సినిమా మరికొన్ని రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి రెడీ అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి రీమేక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో అనేది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందనేది కథ. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. తాజా సర్ధుబాట్ల నేపథ్యంలో ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి ధియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
పవన్ సరసన నిత్యా మీనన్ నటించిన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు. సితార ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న భీమ్లా నాయక్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విడుదలకు కొన్నిరోజుల ముందుగా, నేడు ట్రైలర్ ను తీసుకువచ్చారు. ఇక ఇవాళ ప్రి-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేద్దమాని భావించిన చిత్రబృందం.. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఫ్యాన్స్ కోసం చిత్రబృందం ట్రైలర్ ను రిలీజ్ చేసింది.
"నాయక్... నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ" అంటూ రానా పలికే డైలాగు ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు, "నేను ఇవతల ఉంటేనే చట్టం... అవతలకి వస్తే కష్టం... వాడికి!" అంటూ పవన్ చెప్పే డైలాగు త్రివిక్రమ్ మార్కును చాటుతోంది. ఇవే కాదు, ట్రైలర్ లో ఉన్న డైలాగులు చూస్తుంటే సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్ధమవుతోంది. రానా పాత్ర ఎంత ఫోర్స్ గా ఉంటుందనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. పవన్ సరసన నాయికగా నిత్యామీనన్.. రానా జోడీగా సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి వున్నా తాజాగా ఈ నెల 25న విడుదల చేస్తన్నారు. ఈ సినిమా కోసం మెగా, దగ్గుబాటి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more