La La Bheemla video promo from Bheemla Nayak భీమ్లా నాయక్ నుంచి లా లా భీమ్లా ప్రోమో అదుర్స్.!

La la bheemla video promo from pawan kalyans bheemla nayak out

bheemla nayak, bheemla nayak video promo, trivikram, the sound of bheemla, samyuktha, saagar k chandra, rana daggubati, pawan kalyan, nithya menen, la la bheemla, bheemla nayak, Tollywood, Movies, Entertainment.

Saagar K Chandra’s much-awaited Bheemla Nayak, starring Pawan Kalyan and Rana Daggubati in the lead roles, might not have a release date yet but the makers have something special in store for fans on Diwali. The makers of the Telugu remake of Malayalam hit Ayyappanum Koshiyum announced that ‘The Sound of Bheemla’ will be out this Diwali.

భీమ్లా నాయక్ నుంచి లా లా భీమ్లా ప్రోమో అదుర్స్.!

Posted: 11/03/2021 07:43 PM IST
La la bheemla video promo from pawan kalyans bheemla nayak out

టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయక్ నుంచి ప్రోమో ఎట్టకేలకు విడుదలైంది. ఉదయం నుంచి పవర్ స్టార్ అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని సాయంత్రం ఏడు గంటలు ఎప్పుడవుతుందా.? అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు పాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి అభిమానులు కూడా ఈ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉదయం నుంచి అత్రుతగా ఎదురుచూసిన వారికి నిజంగానే దీపావళి పండగ ఒక్క రోజు ముందే వచ్చేసింది. తమ అభిమాన తారలు నటించిన చిత్రం నుంచి ప్రోమో విడుదల కావడమే వారికి పండగను తీసుకువచ్చింది.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్నాడు. మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భీమ్లా నాయక్’ క్రేజీ అప్ డేట్ రానే వ‌చ్చింది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి ‘లాలా భీమ్లా’ వీడియో సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. గూస్ బంప్స్ తెప్పించే బీట్‌తో షురూ అయింది ప్రోమో. ‘నాగరాజుగారు హ‌ర్టీ కంగ్రాచ్చులేష‌న్స్ అండి..మీకు దీపావ‌ళి పండుగ ముందే వ‌చ్చేసిందండి ..హ్యాపీ దీపావ‌ళి’ అంటూ ప‌వ‌న్ డైలాగ్స్ తో సాగుతున్న ప్రోమో మాస్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉంది.

ప్రోమో గురించి తెలియ‌జేస్తూ మేక‌ర్స్ ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో ముదురు ఎరుపు రంగు ష‌ర్ట్‌, గ‌ళ్ల లుంగీలో ఉన్న పవన్ కళ్యాణ్ త‌న ముందు మందు బాటిల్ పెట్టుకుని మాస్ లుక్‌లో అద‌ర‌గొడుతున్నాడు. మలయాళంలో సూప‌ర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌గా వ‌స్తున్న ఈ మూవీ 2022 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న భీమ్లా నాయ‌క్‌లో కోలీవుడ్ భామ నిత్యా మీనన్ మాలీవుడ్ భామ సంయుక్తా మీన‌న్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles