Kajal Aggarwal Opens Up About Her Pregnancy Rumours ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన కాజల్ అగర్వాల్..

Kajal aggarwal silences pregnancy rumours will speak when time is right

kajal aggarwal, kajal aggarwal pregnant, kajal A Kitchlu pregnancy rumours, maternity leave, Acharya, interior designer boyfriend, Gautam Kitchlu, celebrity news, social media, Bollywood, Movies, Entertainment

Actress Kajal Aggarwal who is now Kajal A Kitchlu post marriage addressed pregnancy rumours. Kajal married Gautam Kitchlu in a low-key ceremony last year post which pregnancy rumours have been abuzz. She said, “I would not like to talk about it right now. I will talk about it when the time is right.”

ప్రెగ్నెన్సీ వార్తలపై క్లారిటీ ఇచ్చిన కాజల్ అగర్వాల్..

Posted: 11/09/2021 03:43 PM IST
Kajal aggarwal silences pregnancy rumours will speak when time is right

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తన చిరకాల మిత్రుడు, ముంబై వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను గతేడాది అక్టోబర్‌ 30న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల వారి తొవి వివాహ వార్షికోత్సం కూడా ముగిసింది. అయితే పెళ్లైనా తరువాత కూడా సినిమాల్లో బిజీగా మారిన కాజల్ పై ఇటీవల కాలంలో ఓ ఆసక్తికర వార్త వినిపించింది. నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కోడుతున్న ఈ వార్తపై మాత్రం ఆమె ఇప్పటివరకు ఎక్కడా అధికారికంగా అమె స్పందించలేదు. ఇంతకీ ఆ వార్త ఏంటని అంటారా.? కాజల్‌ గర్భం దాల్చిందని, త్వరలోనే ఆమె సినిమాలకు బ్రేక్‌ చెప్పనుందంటూ కథనాలు వెలువడ్డాయి.

కాజల్ ఈ వార్తలపై స్పందించకపోవడంతో ఈ వార్తల్లో నిజం లేకపోలేదని అనుకుంటున్నారు అమె ఫాన్స్. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్‌ ఈ విషయంపై స్పందించింది. ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది. ఈమేరకు కాజల్‌ మాట్లాడుతూ.. ‘నా ప్రెగ్నెన్సీ విషయంపై ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు. సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తా. మాతృత్వం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. నా చెల్లెలు(నిషా అగర్వాల్‌) తల్లి కాబోతున్నప్పుడు తను ఎలాంటి ఫీలింగ్స్‌ ఫేస్‌ చేసింది.. ఇప్పుడు తల్లి అయ్యాక ఎలా ఫీల్‌ అవుతుందో దగ్గరుండి గమనించాను’ అని పేర్కొంది.

ఇక ‘నిషా కుమారుడు ఇషాన్ తో ఎక్కువ సమయం గడుపుతుంటా. అప్పుడు నేను తనకి తల్లిని అనే భావనతో గడుపుతాను. నా విషయానికి వచ్చేసరికి భిన్నమైన భావన కలుగుతోంది. ఒక్కోసారి తల్లి అవ్వాలనే భావనే నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నాను’ అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్న ఫ్యాన్స్‌ అంతా త్వరలోనే కాజల్‌ శుభావార్త చెప్పనుందా? అంటూ అభిప్రాయ పడుతున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికోస్తే.. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న కాజల్‌ ప్రస్తుతం ఉమ అనే సినిమా చేస్తోంది.

 
 
 
View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles