Varudu Kaavalenu: Magical Love Saga Of Contrasting Couple ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘వరుడు కావాలెను’ టీజర్

Varudu kaavalenu teaser naga shaurya finds his bride in reluctant ritu varma

varudu kaavalenu, varudu kaavalenu teaser, naga shaurya, ritu varma, naga shaurya varudu kaavalenu, ritu varma varudu kaavalenu, naga shaurya movies, ritu varma movies, varudu kaavalenu cast, Lakshmi Sowjanya, Vishal Chandrashekhar, Suryadevara Naga Vamsi, Tollywood, Movies, Entertainment

On producer S Radha Krishna’s birthday, production house Sithara Entertainments unveiled the teaser for their next film, Varudu Kaavalenu. Sharing the teaser on social media, they wrote, “We need a bridegroom for our bride. Here’s our fun-filled #VaruduKaavalenuTeaser. Hope you all like it!”

ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘వరుడు కావాలెను’ టీజర్

Posted: 08/31/2021 01:01 PM IST
Varudu kaavalenu teaser naga shaurya finds his bride in reluctant ritu varma

యువనటుడు నాగశౌర్య హీరోగా రూపోందుతున్న 'వరుడు కావలెను' సినిమాపై తెలుగు ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి. ఇటీవల విడుదలైన దిగుదిగు దిగునాగ పాటకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగశౌర్యకి యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ ఉన్న క్రేజ్ నేపథ్యంలో రూపోందుతున్న ఈ చిత్రం ఆయన క్రేజ్ ను మరింత పెంచుతుందన్న నమ్మకాన్ని సినీవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను ఎంటర్ టైయిన్ చేసే కథాంశంతో రూపోందుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా, లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కథానాయికగా రీతూ వర్మ సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. నాయకా నాయికలకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ బావుంది. అందం .. ఆత్మాభిమానం .. కాస్త అహంభావం ఉన్న పాత్రలో రీతూ వర్మ పాత్రను చూపించనున్నట్టు అర్థమవుతోంది. సహనంతో ఆమెను లైన్లో పెట్టే పనిలో ఉన్నవాడిగా కథానాయకుడు కనిపిస్తున్నాడు.

"ఆ అందం .. ఆ పొగరు .. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టుగా ఉంది" .. "మీ బాస్ ఏంటి భయ్యా ఎడారిలో ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు" అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నదియా .. వెన్నెల కిషోర్ .. మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం హీరో నాగశౌర్య చేతిలో అరడజను తెలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'వరుడు కావలెను' ‘లక్ష్య’ సహా మరో నాలుగు చిత్రాలు వున్నాయి. వీటన్నింటికీ ఒకటి తరువాత మరోకటి రిలీజ్ చేసేందుకు చిత్రబృందాలు రెడీగా వున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh