Boney Kapoor accuses SS Rajamouli of ‘bullying’ రాజమౌళి మాటలను నమ్మలేకపోతున్నా: బోనికపూర్

Boney kapoor slams ss rajamouli over maidaan rrr clash

Maidaan vs rrr, maidaan rrr box office clash, boney kapoor slams ss rajamouli again over maidaan rrr clash, boney kapoor on maidaan-rrr clash nothing short of sabotaging and bullying, RRR, Olivia morris, Junior NTR, Ram Charan, Ram Charan Tej, Tarak, Cherry, Mega Fans, Nandamuri fans, Ajay devgn, Shriya Saran, Samudrakhani, kumaram bhem, alluri sitarama raju, RRR release date, Alia bhat, Rajamuli, jakanna, RRR, ntr, tollywood, movies, entertainment

Producer Boney Kapoor is upset ever since it has been announced that SS Rajamouli's star-driven ensemble film RRR will be clashing with Ajay Devgn starrer Maidaan at the box office during the Dussehra weekend this year.

రాజమౌళి మాటలను నమ్మలేకపోతున్నా: బోనికపూర్

Posted: 02/13/2021 06:58 PM IST
Boney kapoor slams ss rajamouli over maidaan rrr clash

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అజయ్ దేవగణ్ హీరోగా నిర్మిస్తున్న 'మైదాన్' చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కూడా అందుకు రెండు రోజుల ముందే 'ఆర్ఆర్ఆర్' సినిమాను విడుద‌ల చేస్తుండ‌డం ప‌ట్ల బోనీక‌పూర్ ఇటీవ‌లే మండిప‌డ్డారు. ఇప్పుడు మ‌రోసారి ఇదే విష‌యంపై బోనీక‌పూర్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఒకే నెలలో రెండు రోజుల తేడాతో ఒకే హీరో నటించిన సినిమాల‌ను విడుదల చేయడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు.

ఆర్‌ఆర్‌ఆర్ లో అజయ్ ‌దేవ్‌గణ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారని, అలాగే, తాను నిర్మాతగా వ్యవహరిస్తోన్న మైదాన్ లో అజయ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడ‌ని బోనీ క‌పూర్ చెప్పారు. ఈ సినిమాను గ‌త ఏడాది విడుదల చేయాలనుకున్నామ‌ని, కరోనా కారణంగా షూటింగ్‌ నిలిచిపోయిందని తెలిపారు. సినిమా కోసం తాము అనుకున్న దానికంటే భారీగానే ఖర్చుపెట్టామ‌ని చెప్పుకొచ్చారు. మ‌ళ్లీ సినిమా షూటింగ్  ప్రారంభించిన సమయంలోనే తాము మైదాన్ విడుదల తేదీని ప్ర‌క‌టించామ‌ని తెలిపారు.  

తాము ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజులకే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుద‌ల ప్ర‌క‌ట‌న వ‌చ్చింద‌ని చెప్పారు. ఇది అనైతికమైన చర్య అంటూ మండిడప‌డ్డారు. తాను ఈ విష‌యంపై ఇటీవల రాజమౌళితో ఫోన్‌లో మాట్లాడానని, విడుదల తేదీతో తనకు సంబంధం లేదని చెప్పార‌ని వివ‌రించారు. అది నిర్మాతల ఇష్టప్రకారం జరిగిందని ఆయన అన్నార‌ని, ఆ మాటలను తాను నమ్మాలనుకోవడం లేదని చెప్పారు. ఆ సినిమా విడుదల గురించి అజయ్ దేవ‌గ‌ణ్ కూ ముందుగా చెప్పి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయప‌డ్డారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచి పేరున్న రాజమౌళి నుంచి తాను ఇలాంటి చర్య ఊహించలేదని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RRR  RRR Vs Maidaan  Boney Kapoor  SS Rajamouli  Ram Charan  Junior NTR  RRR release date  tollywood  

Other Articles