వైవిధ్యమైన సినిమాలను ఎంచుకునే వాటిలో తన నటను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపించే కథానాయకుల్ల్లో నందమూరి కల్యాణ్ రామ్ ఒకరు. ఈ నందమూరి హీరో త్వరలోనే భారీ బడ్జెట్ తో రూపొందబోయే పీరియడ్ డ్రామాలో నటించబోతున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఫిల్మ్ యూనిట్ ఇవాళ టైటిల్ ను కూడా ఖరారు చేసింది. కల్యాణ్ రామ్ నటిస్తున్న స్పై, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం పేరు 'ఏజెంట్ వినోద్'గా చిత్రబృందం ఖారారు చేసింది. ఈ చిత్రానికి 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం ఈ సినిమాను రూపోందించనున్నారు.
ఇప్పటి వరకు పీరియాడికల్ మూవీలో నటించని నందమూరి కల్యాణ్‌రామ్ కథ వినగానే వెంటనే ఓకే చెప్పేశాడట. 1940 బ్యాక్ డ్రాప్లో ఈ స్పై థ్రిల్లర్ రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్ కోసం రెండు భారీ సెట్లు నిర్మాణం జరుగుతుందని, అక్కడే అధిక శాతం చిత్రం షూటింగ్ జరగనుందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా మేకింగ్‌లో వీఎఫ్ఎక్స్ కీలకంగా మారనుందట. ప్రస్తుతం కల్యాణ్‌రామ్ మల్లిడి వేణు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more