పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన సోషల్ మీడియా వేదికగా హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ఆధ్యంతం ఆకట్టుకునేలా సాగింది. ‘‘ఒరేయ్ సుక్కు నా బైక్ వచ్చేసిందిరా..’’ అనే డైలాగ్ తో హీరో సుశాంత్ తనకు బైక్ పై వున్న అసక్తిని కనబరుస్తోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ‘మిస్ గ్రాండ్ ఇండియాగా’ మీనాక్షీ చౌదరి.. తన అఫీస్ సహచరుడైన హీరో వద్దకు వచ్చి ‘‘ ఇఫ్ యు డొంట్ మైంట్.. నన్ను డ్రాప్ చేస్తావా.? అని అడగడంతో ఆయనలో సంతోషం వెల్లివిరుస్తుంది.
అప్పటికే ఆమెపై క్రాస్ ఉన్న హీరోకు భైక్ తీసుకువచ్చిన ఆఫర్ ఇదిలా అనిపిస్తోంది. ఇక హీరో కూడా తన మాటల్లో.. ‘‘ నా లైఫ్ లో అమ్మకి, అమ్మాయికి, బైక్ కి అభినాభావ సంబంధం వుంది’’ అన్న డైలాగ్ కూడా బైక్ తో హీరోకు వున్న ఎమోషన్ తెలియజేస్తోంది. ఇక ఒక కాలనీలోని నో పార్కింగ్ ఏరియాలో బైక్ పార్క్ చేసిన హీరో పనిపై లోనికి వెళ్లడం.. దీంతో కాలనీ వాసులు బైక్ ను ధ్వంసం చేయడం.. అంతేకాకుండా ‘‘ఈ సారి వాడు బయటకు వెళ్తే అది శవంగానే’’ అన్న డైలాగ్ కూడా చిత్రంతలోని సస్పెన్స్ ధ్రిల్లర్ ను రక్తికట్టిస్తోంది.
బైక్ వల్ల హీరో సుశాంత్ లో వెల్లివిరిసే ఆనందం.. ఆ వెంటనే దాంతోనే ఆయన ఎదుర్కోనే ఇబ్బందులు టీజర్ లో కనిపిస్తున్నాయి. ‘‘ చేయి దాటిపోతుందిరా.. ఏదో ఒకటి చేయాలిగా వెంటనే..’’ అంటూ హీరో అంగలార్చడం.. చిత్రంలో సస్పెన్స్ కు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. నూతన దర్శకుడు ఎస్ దర్శన్ చిత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తుండగా, గత కొంతకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్ కి ఈ చిత్రం బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, మధు, వెంకట్ హీరో సహచరులుగా నటిస్తూ కామెడీని పండించనున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more