విలక్షన నటుడు, సీనియర్ హీరో, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో ఆయన దేనినో నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా వున్నారు. ఆయన గతానికి భిన్నమైన హెయర్ స్టైయిల్ తో ఈ చిత్రంలో కనిపించనున్నారు. పెద్దరాయుడు తరువాత అంతటి ప్రత్యేకత కలిగిన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా చిత్రంలో కనిపిస్తున్న ఆయన.. ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నారు.
ఈ ఫస్ట్ లుక్ లో ఆయన తన వంటిపై తెల్లని కుర్తాను ధరించాగా, ఉద్విన్నంగా పరిశీలిస్తున్న కంటిచూపుతో.. ఎమోషనల్ లుక్ తో.. మెడలోని రుద్రాక్షల మాల ధరించి కనిపిస్తోంది. దశాబ్ద కాలం తరువాత ఆయన ఈ తరహాలో అత్యంత ధృడచిత్తం కలిగిన వ్యక్తిగా ఫస్ట్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ ఏమిటంటే.. నటి ప్రగ్యా జైశ్వాల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత సామ్రాట్ మాస్ట్రియో ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. తన సోంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ తో పాటు తన తనయుడు హీరో మంచు విష్ణు బ్యానర్ 24 ఫ్రేమ్స్ ప్యాక్టరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంతో ఆయన కొడలు, మంచు విష్ణు సతీమణి విరానికా మంచు స్టైలిస్ట్ గా మారాగా.. తన మామను ఈ చిత్రంలో విభిన్నంగా చూపుతున్నారు. ఈ చిత్రంలోని పాటలను సుద్దాల అశోక్ తేజ గేయరచన చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more