rajendra prasad lessons to granddaughter sai tejeswini చిన్నారి సావిత్రికి నవ్వులకిరిటి రాజేంద్రుడు పాఠాలు

Amid lockdown rajendra prasad lessons to granddaughter sai tejeswini

navvula kiriti, comedy king, comedian, Rajendra prasad, chinnari savitri, sai tejeswini, valuble lessons of life, yoga, walking, excercise, granddaughter sai tejeswini, lockdown video, Tollywood, movies, Entertainment

The comedy king and navvula kiriti Rajendra Prasad passes his whole time with yoga, walking, spending time with granddaughter and helping the house members in their work amid lockdown due to coronavirus in the country.

చిన్నారి సావిత్రికి నవ్వులకిరిటి రాజేంద్రుడు పాఠాలు

Posted: 04/25/2020 07:48 PM IST
Amid lockdown rajendra prasad lessons to granddaughter sai tejeswini

‘మహానటి’ చిత్రంలో చిన్నారి సావిత్రిగా మెప్పించిన సాయి తేజశ్వినికి నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ జీవిత పాఠాలు నేర్పిస్తున్నారు. దేవుడు పెట్టే ఇలాంటి పరీక్షల నుంచే ప్రతి ఒక్కరూ ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవాలని ఆయన తెలియజేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కామెడీ కింగ్‌, నటకిరీటిగా పేరు తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్‌ లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌లో రాజేంద్రప్రసాద్‌ రోజువారీ లైఫ్‌స్టైల్‌ ఎలా ఉంటుందో అని అభిమానులు తెలుసుకోవాలని భావించడం సహజం.

దీంతో అభిమానులకు తెలియజేసే విధంగా ఓ వీడియోను రూపొందించి పంచుకున్నారు రాజేంద్రప్రసాద్. యోగా, వాకింగ్‌తో ప్రారంభమయ్యే ఆయన దినచర్య గార్డెనింగ్‌‌, వంట చేయడం వంటి పనులతోపాటు చాలా ప్రశాంతంగా సాగుతోంది. అంతేకాకుండా లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్స్‌ లేకపోవడంతో ఇంట్లో ఉంటున్న తన మనవరాలు సాయి తేజశ్వినికి ఆయన ఎన్నో విలువైన పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే జీవితం చాలా బాగుంటుందని ఆయన తెలిపారు. రోజు మొత్తంలో ఓ అరగంటపాటు నడవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయన వివరించారు. ఎక్కువసేపు ఇంట్లోనే ఉంటే బోరుకొడుతుందని చెప్పడం మానేసి ఇంటి పనుల్లో మహిళలకు సాయం చేయాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles