Vijay Devarakonda declines Koratala Siva's challenge ‘నన్ను రియల్ మ్యాన్ గా పరిగణించడం లేదు’: విజయ్

Vijay devarakonda declines koratala siva s challenge fans say stop overacting

Vijay Devarakonda, Koratala siva, Vijay Deverakonda, Vijay declined Siva challenge, Director Koratala Siva challenge, #BetheREALMAN challenge, Vijay Devarakonda mother, Vijay Devarakonda fans ask stop overacting, #BeTheREALMAN, Tollywood, Movies, Entertainment

Vijay Devarakonda declined to accept director Koratala Siva's challenge of #BeTheREALMAN, saying his mother is not allowing to do any task at home.

‘నన్ను రియల్ మ్యాన్ గా పరిగణించడం లేదు’: విజయ్

Posted: 04/24/2020 04:42 PM IST
Vijay devarakonda declines koratala siva s challenge fans say stop overacting

ఇంట్లో తనని ఇంకా రియల్‌ మ్యాన్‌లా చూడడం లేదని టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు అన్ని పనుల్లో తమ ఇంట్లోని మహిళలకు సాయం చేసి #BeTheREALMAN అని అనిపించుకుంటున్నారు. డైరెక్టర్ సందీప్ వంగా నుండి ప్రారంభమైన ఈ చాలెంజ్ లో పాల్గొంటున్న సెలబ్రిటీలు.. తమ వీడియోలను సైతం సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తారక్‌ నామినేట్‌ చేయడంతో #BeTheREALMAN ఛాలెంజ్‌ను స్వీకరించిన కొరటాల శివ తన వంతుగా హీరో విజయ్‌ దేవరకొండను నామినేట్‌ చేశారు.

దీంతో స్పందించిన విజయ్‌.. తనని ఇప్పటికీ ఇంట్లో చిన్నపిల్లాడి మాదిరిగానే చూస్తున్నారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌లో తన రోజూవారీ జీవితానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను తప్పకుండా పోస్ట్‌ చేస్తానని అన్నారు. ‘శివ సర్‌.. మా అమ్మ నన్ను పని చేయనివ్వడం లేదు. ఎందుకంటే నేను పనిచేస్తే ఇంట్లో పని డబుల్‌ అవుతుందంట. ఇంట్లో మమ్మల్ని ఇంకా రియల్‌ మ్యాన్‌లా చూడడం లేదు. పిల్లల్లానే ట్రీట్‌ చేస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌లో నా రోజువారీ లైఫ్‌ ఎలా ఉంటుందో తెలియజేస్తూ ఓ వీడియోను మాత్రం తప్పకుండా పోస్ట్‌ చేస్తాను’ అని విజయ్‌ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh