Lyrical song from Entha Manchivadavuraa ఏమో, ఏమో ఈ గుండెల్లో అంటున్న ఎంత మంచివాడవురా.!

Kalyan ram s entha manchivadavuraa lauches lyrical song

kalyan ram in sankranthi fight, kalyan ram entha manchivadavu ra, nandamuri kalyan ram, Mehreen Pirzada, entha manchivadavu ra, Emo Emo Ye Gundello, Lyrical song, Satish Vegesna, Gopi Sundar, Aditya Music, tollywood, movies, Entertainment

Presenting herewith the lyrical video song 'Emo Emo Ye Gundello' taken from the film Entha Manchivaadavuraa. The song is sung by S P Balasubramanyam and the Lyrics are penned by Ramajogayya Sastry. The music is composed by Gopi Sundar.

ఏమో, ఏమో ఈ గుండెల్లో అంటున్న ఎంత మంచివాడవురా.!

Posted: 12/09/2019 05:28 PM IST
Kalyan ram s entha manchivadavuraa lauches lyrical song

విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే నందమూరి కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సంక్రాంతి మాత్రం అలా రోటీన్ గా కాకుండా అటు సూపర్ స్టార్ మహేష్.. ఇటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పోటీ పడేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తాను చాటాలని భావిస్తున్నాడు. గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న కళ్యాణ్ ప్రస్తుతం ‘ఎంత మంచి వాడవురా!’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

‘ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం..’ అంటూ సాగిన ఈ పాటను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా గోపీ సుందర్ సంగీతం అందించారు. సతీశ్ వేగేశ్న దర్వకత్వంలో రూపొందుతున్న ‘ఎంత మంచివాడవురా’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్ రామ్ సరసన మెహరీన్ నటిస్తోంది. శరత్ బాబు, సుహాసిని, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల తదితరులు ఈ చిత్రంలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles