Celebrity buzzing on tick - talk టిక్ - టాక్ లలో సెలెబ్రెటీలా సందడి..

Celebrity buzzing on tick talk

Madhuri Dixit, Sunny Leone, Tik Tok Videos, Bollywood Stars, Shahid Kapoor, Riteish Deshmukh, Entertainment

Now a days every one are following Tik Tok and doing videos. Now Bollywood stars also following the Tik Tok like Madhuri Dixit, Sunny Leone, and others doing videos.

టిక్ - టాక్ లలో సెలెబ్రెటీలా సందడి..

Posted: 11/16/2019 05:04 PM IST
Celebrity buzzing on tick talk

నేడు “ టిక్ - టాక్ “ ఈ పేరు తెలియని వారు లేరనుకుంటా . ప్రతి ఒకరి జీవితంలో టిక్ టాక్ అనేది ఒక ముఖ్య భాగం అయిపోయినది. ఉదయం లేచినపట్టి నుండి మొదలుకొని నిద్ర కు ఉపకరించే వరకు ఆ టిక్ టాక్ లో మనం మునిగి తేలుతుంటాము. ఇటు చిన్న - పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒకరిని తన మాయలో పడవేసుకుంది మన టిక్ - టాక్ మాయ జాలం.అందులో పోస్ట్ లు వాటికి లైకులు కామెంట్లు ఆ హావ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్కరు దాని ఊవిలో పడిపోతున్నారు.

ప్రతి ఒక విషయంలో అయినా వస్తువులో అయినా ఎంత మంచి ఉంటుందో అంతే చేడు కూడా ఉంటుంది. టిక్ - టాక్ వల్ల హీరో హీరోయిన్ లాగా ఎదగాలని కలలు కన్నె వారి కల నెరవేరుతున్నది. వారంతా తమ తమ ప్రతిభ పాటవాలను ఈ యాప్ ద్వారా చూపించుకొని ఆనందపడుతున్నారు. అంతే కాకుండా కొందరి ప్రతిభను మెచ్చి,గుర్తించి సినిమా అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే మరి కొందరు ఈ “ టిక్ టాక్ “ను చాల చెడ్డు గా ఉపయోగిస్తున్నారు. అందులో అసభ్యకర వీడియోలు,అసభ్య కర కామెంట్ లను పెట్టి నలుగురిని బాధిస్తున్నారు. అయినా మనం అందరం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, సోషల్ మీడియా పోస్టుల పై అలోచించి మరి పోస్ట్ లను అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఈ “టిక్ - టాక్ “ లను సాధారణ ప్రజలతోపాటు సెలెబ్రెటీస్ కూడా ఉపయోగించి మరింత క్రేజ్ తీసుకువచ్చారు.

ఒకమారు బాలీవుడ్ లోకి మనం తొంగి చూస్తే అర్ధమవుతున్నది.

అందాల భామ “మాధురీ దీక్షిత్ “ ఈ మధ్యలోనే టిక్ టాక్ లో ఖాతా తెరిచారు. కొన్ని రోజుల లోనే ఆమె కు 8 లక్షల మంది ఫాలో వర్స్ అయ్యారు. అంతేకాకుండా ఆమె ప్రొఫైల్ కు 1.7 మిలియన్ల లైక్స్ వచ్చాయి.. ఇప్పటికి ఆమె రెండు వీడియోలను మాత్రమే షేర్ చేసారు.

“షాహిద్ కపూర్ “ ఇప్పటికి 6 వీడియోలను షేర్ చేయగా 6. 2 లక్షలమంది ఆయనను ఫాలో అవుతున్నారు. 8 లక్షల మంది ప్రొఫైల్ ని లైక్ చేసారు..

“సన్నీ లియోని “ 1. 4 , మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె ప్రొఫైల్ ని 5.9 మిలియన్ల మంది లైక్ చేసారు. అందరి స్టార్లపై కంటే సన్నీ చాల చురుకుగా వ్యవహరిస్తున్నారు తన ప్రొఫైల్ ని ఎ ప్పటికపుడు అప్డేట్ చేస్తూ , కొత్త కొత్త వీడియోస్ ని షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు.

“ రితేష్ దేశముఖ్ “ 30 వీడియోస్ ని షేర్ చేయగా 6 మిలియన్ల మంది ఆయనను ఫాలో అవుతున్నారు. అయన ప్రొఫైల్ ని 42. 8 మిలియన్ల మంది లైక్ చేయడం విశేషం.

శ్రీవల్లి. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhuri Dixit  Sunny Leone  Tik Tok Videos  Bollywood  

Other Articles