Dil Raju Stays Away From Mahesh Babu! మహేష్ మూవీ నుంచి దిల్ రాజు తప్పుకున్నాడా.?

Dil raju stays away from mahesh babu

Anil Ravipudi, Anil Sunkara, Dil Raju, Maharshi, Aswini Dutt, Mahesh Babu, movies, entertainment, tollywood

Dil Raju considered being a part of #Mahesh26 directed by Anil Ravipudi, he has now opted out of it according to grapevine. Anil Sunkara is ready to produce it all by himself and also offered a mindboggling amount as remuneration for Mahesh.

మహేష్ మూవీ నుంచి దిల్ రాజు తప్పుకున్నాడా.?

Posted: 04/30/2019 10:04 PM IST
Dil raju stays away from mahesh babu

మహేశ్ బాబు 25వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'మహర్షి' సిద్ధమవుతోంది. ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయనున్నాడు. ప్రస్తుతం లొకేషన్లు ఎంపిక చేసే పనిలో అనిల్ రావిపూడి వున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు - అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరించనున్నట్టు చెప్పారు. అనిల్ సుంకరకి మహేశ్ ఒక సినిమా చేసిపెట్టవలసి వుంది. ఇక అనిల్ రావిపూడితో గల సాన్నిహిత్యం కారణంగా దిల్ రాజు కూడా రంగంలోకి దిగాడు. అలా ఈ ఇద్దరి నిర్మాణంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లవలసి వుంది.

కానీ హఠాత్తుగా ఈ ప్రాజెక్టు నుంచి దిల్ రాజు తప్పుకున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అందుకు కారణాలేమిటనేది తెలియాల్సి వుంది. అనిల్ సుంకర ఈ సినిమాకి సోలో నిర్మాతగా వ్యవహరిస్తారన్న టాక్ కూడా వుంది. ఈ విషయంలో ఇప్పటికే మహేష్ బాబుకు భారీ మొత్తం కూడా ఇచ్చేశారని రూమర్లు వినిపిస్తున్నాయి. మహర్షి చిత్రంలో దిల్ రాజు సోలో నిర్మాతగా వుండగా, అశ్వనీ దత్ కు తాను ఎప్పుడో ఇచ్చన మాట మేరకు ఆయనను కలుపుకోవాల్సిందిగా మహేష్ కోరడంతో.. ఆ తరువాత వంశీ వినతి మేరకు పీవీపీలు కలవడంతో ఈ చిత్రానినిక ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక రాబోయే చిత్రంలోనూ ఇద్దరు నిర్మాతలుగా వ్యవహరించాల్పి రావడంతోనే దిల్ రాజు తప్పుకున్నాడని టాక్ వినబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anil Ravipudi  Anil Sunkara  Dil Raju  Maharshi  Mahesh Babu  Aswini Dutt  tollywood  

Other Articles