EC refuses nod for 'Lakshmi's NTR' release in Andhra ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మళ్లీ బ్రేకులు

Ec refuses nod for lakshmi s ntr release in andhra

Lakshmi's NTR, Ram Gopal Varma, NTR, Sritej, N. T. Rama Rao, Chief Electoral Officer, Election Commission, Chief Minister, Andhra Pradesh, Telugu Desam Party (TDP), Vijayawada, CEO, TDP President, Gopal Krishna, movies, entertainment, tollywood

Controversial filmmaker Ram Gopal Varma's Telugu movie "Lakshmi's NTR" will not be released in Andhra Pradesh on Wednesday as election authorities on Tuesday said the orders restricting the film's exhibition were still in force.

ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మళ్లీ బ్రేకులు వేసిన ఈసీ

Posted: 04/30/2019 10:03 PM IST
Ec refuses nod for lakshmi s ntr release in andhra

తెలంగాణలో ఇప్పటికే విడుదలైన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపోందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి అంధ్రప్రదేశ్ లో విడుదలకు మరోమారు బ్రేక్ పడింది. మే 1న మీముందుకు వస్తున్నామని ప్రకటించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న వర్మకు ఈసీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఈ చిత్ర విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బయోపిక్ లపై రాజకీయ పార్టీలు తెలిపిన అభ్యంతరం మేరకు పలు బయోపిక్ చిత్రాలకు బ్రేక్ పడిందని తెలిపింది.

వీటిలో ఆర్జీవి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంతో పాటు మరో రెండు చిత్రాల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. తదుపరి ఉత్తర్వులను వెలువరించేంత వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఏప్రిల్ 10న వెలువరించిన ఆ ఉత్తర్వులో పేర్కొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా విడుదలపై తరుపరి ఉత్తర్వులు ఇవ్వలేదని ఎన్నికల సంఘం తెలిపింది. అంతేకాదు, ఉత్తర్వుల ప్రతిని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపింది. సినిమా థియేటర్లలో చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వరాదని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakshmi's NTR  Ram Gopal Varma  NTR  Sritej  N. T. Rama Rao  Chief Electoral Officer  tollywood  

Other Articles