అక్కినేని కుటుంబానికి చెందిన యువ భార్యభర్తలు కలసి పెళ్లైన తరువాత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మజలీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం కన్నా.. చిత్ర టైటిల్ కన్నా ఈ రియల్ లైఫ్ పెయిర్, రీల్ లైఫ్ లో కూడా కలసి నటించడం అందుకు కారణమైంది. ఇటీవలే డెహ్రాడూన్, విశాఖ సహా పలు ప్రాంతాలలో ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి గాను సమంత ఎంత పారితోషికం తీసుకుంటోంది? చైతూకు ఎంత ముడుతోంది? అనే విషయంలో ఫిల్మ్ నగర్లో చర్చలు నడుస్తున్నాయి. ఎవరికి ఎంత అనే విషయంలో లెక్కలకి అవకాశం లేకుండగా, ఈ ఇద్దరూ కలిసి జాయింట్ రెమ్యునరేషన్ గా నిర్మాత నుంచి 6 కోట్ల 50 లక్షల రూపాయలను అందుకున్నట్టుగా తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more