sumanth idam jagat movie first look ‘ఇదం జగత్’ మరో వైవిధ్యచిత్రంలో సుమంత్

Sumanth idam jagat movie first look

sumanth, idam jagat, Anil Srikantam, first look, crime and suspence thriller, movies, entertainment, tollywood

The thriller has been titled 'Idam Jagat' and its first look was unveiled today. Makers say Sumanth has not done such role in his entire career. Anil Srikantam is the director.

‘ఇదం జగత్’ మరో వైవిధ్యచిత్రంలో సుమంత్

Posted: 06/25/2018 05:26 PM IST
Sumanth idam jagat movie first look

'మళ్లీ రావా' సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన హీరో సుమంత్‌ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల మందుకు వస్తున్నాడు. ‘మళ్లీ రావా’ సినిమా అందించిన కొత్త ఊపును, ఉత్సాహాన్ని పునికిపుచ్చుకుని మరో వైవిధ్యభరితమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ఇదం జగత్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్ ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సుమంత్‌.. మరోసారి వైవిధ్యభరిత చిత్రంతో అలరించబోతున్నాడని ఈ ఫస్ట్‌ లుక్‌ చెప్పకనే చెబుతోంది. ఈ ఫస్ట్‌ లుక్‌లో.. 'క్రైమ్‌ సీన్‌'లో కెమెరా పట్టుకుని తీక్షణంగా చూస్తున్న సుమంత్‌.. మనకు కనిపిస్తాడు. విరాట్ పిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ  జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

Shoot all done, and in post production. Here's the first look of my next release #IdamJagath pic.twitter.com/t21cmcBu16

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles