Pawan Kalyan Steps Out To Rescue Allu Arjun బన్ని మూవీకి ముఖ్యఅతిధిగా పవన్ కల్యాన్

Pawan kalyan turns chief guest for allu arjun

Allu Arjun, Naa Peru Surya, Pawan Kalyan, Sucessmeet, tollywood, movies, entertainment

Now Pawan Kalyan ie returning the favor by attending success meet of Allu Arjun's latest film Naa Peru Surya.

బన్ని మూవీకి ముఖ్యఅతిధిగా పవన్ కల్యాన్

Posted: 05/08/2018 06:54 PM IST
Pawan kalyan turns chief guest for allu arjun

పవర్ స్టార్ పవన్ కల్యాన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మద్య బిన్నాభిప్రాయాలు తలెత్తినా.. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి రావడంతో.. ఫిల్మ్ ఛాంబర్ లో సినీ ప్రముఖులతో చర్చించేందుకు వెళ్లిన పవన్ కల్యాన్ కు మద్దతుగా అక్కడికి వెనువెంటనే వెళ్లిన అల్లు అర్జున్ రాకతో ఇద్దరి మధ్య ఎలాంటి పోరపచ్చాలు లేవని, అంతా అభిమానుల మధ్యేనని తేలిపోయింది. అయితే ఇద్దరు కలవడం మాత్రం అభిమానులకు ఆనందంలో ముంచింది. అయితే ఈ అనందాన్ని మరింతగా పెంచేందుకు అల్లుఅర్జున్, పవన్ కల్యాన్ రెడీ అవుతున్నారు.

అదేంటి అంటారా.. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనబోతున్నాడు. స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. లగడపాటి శ్రీధర్‌, నాగబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు చితంలో నటించిన నటినటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. నా పేరు సూర్య సినిమాను రూ.60 కోట్ల వ్యయంతో తెరకెక్కించడం జరిగింది. హిందీ, తెలుగు శాటిలైట్ రైట్స్ రూపంలో రూ.24 కోట్లు వచ్చాయని సమాచారం. సైనికుడిగా బన్నీ చక్కటి నటన కనబర్చడం, సైనికుడి పాత్ర అందరికి నచ్చడం యూత్‌, మాస్‌ను ఆకట్టుకునేలా యాక్షన్ సీన్లు ఉండటంతో ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Naa Peru Surya  Pawan Kalyan  Sucessmeet  tollywood  movies  entertainment  

Other Articles