తెలుగు చిత్రసీమలో అగ్రహీరోల బర్త్ డే అంటే అభిమానులకు పండగే. ఎందుకంటే వారు నటించబోయే తదుపడి ప్రాజెక్టులకు సంబంధించిన టీజర్లు, పస్ట్ లుక్ సహా అనేక విషయాలపై క్లారిటీ వచ్చేస్తుంది. అదే తరహలో నందమూరి నటవారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆయన జన్మదినం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటారా.? ఆయన పుట్టిన రోజు మరికొన్ని రోజుల్లోనే వుందికాబట్టి. ఇక అందునా.. తారక్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. దీంతో తమ అభిమాన హీరో డబుల్ ధమాకా ఇస్తాడని కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఈ నెల (మే) 20న ఎన్టీఆర్ జన్మదిన ట్రీట్ ఎలా వుండబోతుందని అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే కేవలం సింగిల్ ట్రీట్ మాత్రమేనని వార్తలు వస్తున్నందున.. సింగిలా..? లేక డబులా.? అంటూ అభిమానుల్లో ఉత్కంఠ రేగుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రానికి సంబంధించి మాత్రం ట్రీట్ వుండబోతుందన్న సమాచారం ఇప్పటికే అభిమానులకు అందింది. యాక్షన్ నేపథ్యమున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ బాగా వర్కవుట్ చేసి చాలా శరీరబరువును కోల్పోయారు.
అయితే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఉంటుందట. ఈ విషయాన్ని మహేష్ కోనేరు కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఫ్యాన్స్ అంతా ఎన్టీఆర్ బర్త్ డే గురించి చాలా యాంక్సైటీగా ఉన్నారు. కాబట్టి అందరికీ నేను చెబుతున్నా. మిమ్మల్ని అయితే నిరుత్సాహ పరచం. ఓ పక్క దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతకంటే ఎక్కువ నేను రివీల్ చెయ్యను. కానీ మీకోసం ఆరోజు సమ్థింగ్ స్పెషల్ మాత్రం వెయిట్ చేస్తోంది’’ అంటూ మహేష్ వెల్లడించారు.
మరోవైపు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో మల్టీస్టారర్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి కూడా యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా జక్కన్న ఓ సర్ ప్రైజ్ ను ఇవ్వనున్నారని సమాచారం. ఏదిఏమైనా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ అందుతుందని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more