Tej I Love You Official Teaser with romantic feel రొమాంటిక్ ఫీల్ తో నిండిన తేజ ఐలవ్ యూ టీజర్

Tej i love you official teaser with sai dharam tej romantic first feel

Tej I Love You Official Teaser, Tej I Love You Teaser, Tej I Love You Movie Official Teaser, Tej I Love You Movie Teaser, Tej I Love You, #Tejiloveyou FirstLook TEASER, #Karunakaran, #SaiDharamTej, #Anupamaparameshwaran, #TejILoveYouTeaser, Tej I Love You Movie, #TejILoveYou, TejILoveYouTeaser, Telugu Movie 2018, Tej Teaser, #TejFirstFeel

Supreme Star Sai Dharam Tej is shooting for a complete breezy romantic drama Tej I Love You, directed by A Karunakaran has released the teaser. The teaser promises a romantic ride keeping up the expectations high.

రొమాంటిక్ ఫీల్ తో నిండిన తేజ ఐలవ్ యూ టీజర్

Posted: 05/01/2018 01:32 PM IST
Tej i love you official teaser with sai dharam tej romantic first feel

జోరుగా వర్షం కురుస్తున్న సమయంలో వేడి వేడిగా చాయ్ తాగుతూ వుంటే వుండే అనందం వేరు. అదే ఆనందానికి ఇంకాస్త రోమాంటిక్ టచ్ ఇస్తే.. తాను నిలబడించి బస్టాంట్ అయ్యి వుంటే.. అదే బస్టాండులో అటు పక్కగా ఓ అందమైన అమ్మాయి చేతిలో గిటార్ పట్టుకుని వినపోంపుగా మీటుతుంటే.. అబ్బో అబ్బో ఆ ఫీలింగే వేరు. ఇక దీనికి కూడా మరింత బ్యూటీఫుల్ రోమాంటిక్ టచ్ ఇచ్చేలా.. కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపోందుతున్న తేజ్ ఐ లవ్ యూ చిత్రంలోని టీజర్ లో నిక్షిప్తమైవుంది.

రొమాంటిక్ చిత్రాలకు ట్రేడ్ మార్క్ గా నిలిచే కరుణాకరణ్ దర్శకత్వంలోని సినిమా అంటేనే అంచనాలు బారీగా పెరిగిపోతుంటాయి. అందులో మెగా ఫ్యామిలీకి చెందిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ హీరోగా నటిస్తున్నాడంటే.. అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఇక వీటికి తోడు తాజగా విడుదలైన టీజర్ అభిమానుల అంచనాలను అకాశానికి ఎత్తేసింది. ఇటీవలే కథకు సూటయ్యేలా.. ఈ సినిమాకి 'తేజ్ ఐ లవ్ యు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా తేజ్ ఫస్ట్ ఫీల్ పేరుతో ఓ చక్కని రోమాంటిక్ టచ్ వున్న టీజర్ ను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. ఇక చాలు.. బ్యూటీఫుల్ రొమాంటిక్ టచ్ ఏంటో చెబుతారా..? అంటూన్నారు కదూ.. అక్కడికే వస్తున్నాం.. బస్టాండులో గిటార్ మీటుతున్న అమ్మాయి.. వర్షంలో టీ తాగుతున్న అబ్బాయి.. చెంతకు అకస్మాత్తుగా చేరితే.. అమ్మాయిని చూసి కంగారుపడిన అబ్బాయి.. ఒకింత సంబ్రమాశ్చార్యానికి లోనై.. తేరుకుని వెంటనే తన చేతిలోని టీ గ్లాసును అమె పెదాలకు అందిస్తే.. దానిని అమె కూడా షేర్ చేసుకుంటే.. అబ్బో ఆ అనందానికి నేను పోందలేదే అని అబ్బాయిలందరూ డ్రీమ్ లోకి వెళ్లలా..? మధ్యవయస్కులు ఫ్లాఫ్ బ్యాక్ లోకి వెళ్లేలా చేస్తుంది. ఇక్కడే ఓ ట్టిస్టు కూడా వుంది.. అదేంటో మీరే టీజర్ చూసి చెప్పేయండీ..

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh