actor sai kumar comments on hero bala krishna బాలయ్యకు అవేశం అధికం.. అది తప్పే..!

Actor sai kumar comments on hero bala krishna

bala krihsna, dharma porata deeksha, PM Modi, Sai Kumar, Karnataka assembly elections, tollywood, movies, entertainment

Tollywood actor sai kumar comments on hero bala krishna, says he knows much about balayya, and his anger. He also says bala krishna comments on PM Modi are absolutely wrong.

బాలయ్యకు అవేశం అధికం.. అది తప్పే..!

Posted: 04/28/2018 04:21 PM IST
Actor sai kumar comments on hero bala krishna

టాలీవుడ్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణపై నటుడు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణకు అవేశం అధికమని అన్న ఆయన.. ఈ క్రమంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు మాత్రం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష సమయంలో బాలకృష్ణ మాట్లాడుతూ, మోదీ వస్తే తరిమితరిమి కొడతామని, పెళ్లాన్ని గౌరవించడం ముందు ఆయన నేర్చుకోవాలని విమర్శించారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్నే రేపాయి.

ఈ వ్యాఖ్యలపై నటుడు, కర్ణాటక బాగేపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అయిన సాయికుమార్ స్పందించారు. ఒక తెలుగువాడిగా చెబుతున్నానని... బాలయ్య చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఎన్టీఆర్ లాగానే బాలయ్య కూడా ముక్కుసూటిగా మాట్లాడతారని, ఆయనకు ఆవేశం ఎక్కువని చెప్పారు. బాలయ్యను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా చెబుతున్నానని అన్నారు.

అయితే, మోదీలాంటి పెద్ద వ్యక్తిని గౌరవించాల్సి ఉందని, కనీసం ఆయన పదవికైనా గౌరవం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, మనసులో ఉన్న బాధను బాలయ్య ఆ విధంగా వ్యక్తపరిచి ఉండవచ్చని అన్నారు. కానీ, వ్యక్తపరిచిన విధానం మాత్రం బాగోలేదని చెప్పారు. తాను బీజేపీలో ఉన్నానని... తన పార్టీ ఏపీకి మంచి చేయాలనే ఒక తెలుగువాడిగా కోరుకుంటున్నానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలనేది తన కోరిక అని అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles