Trisha Creates Confuse with Saamy Square | విక్రమ్ సినిమాతో చిక్కుల్లో త్రిష

Trisha in saamy square controversy

Trisha, Saamy Square, Vikram, Shibu Thameens, Director Hari, Keerthy Suresh, Trisha Controversy, Trisha Producer Council

Through an official statement on Twitter, Trisha had made it clear that she had opted out of Saamy Square citing creative differences and politely wished the team. But the makers of the film- producer Shibu Thameens and director Hari approached the Tamil Producers Council and asked them to intervene and issue a red card on the actress.

సామి స్క్వేర్ వివాదం.. చిక్కుల్లో త్రిష?

Posted: 01/09/2018 06:22 PM IST
Trisha in saamy square controversy

చెన్నై చంద్రం త్రిషకి ఇప్పుడు తెలుగులో పెద్ద సినిమాలు చేయకపోయిన, తమిళంలో మాత్రం పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈ అమ్మడిపై సామి2 చిత్ర నిర్మాత శిబు థమీన్స్ నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

చియాన్ విక్రమ్ హీరోగా 2003లో సామి అనే చిత్రాన్ని చేసిన విక్రమ్ ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా సామి స్వ్కేర్ చిత్రం చేస్తున్నాడు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిషని కథానాయికగా ఎంచుకున్నారు. కొద్ది రోజులు షూటింగ్ లో పాల్గొన్న ఈ అమ్మడు ఇతర కారణాల వలన సినిమా నుండి తప్పుకుంది. ఈ నేపథ్యంలో కథానాయికగా కీర్తి సురేశ్ ని తీసేసుకుని షూటింగ్ ప్రారంభించారు. అయితే కీర్తితోపాటు త్రిష కూడా ఈ చిత్రంలో నటిస్తుందని హీరో విక్రమ్, దర్శకుడు హరి కూడా స్ప్టష్టం చేశారు. ఈ వార్తల నేపథ్యంలో మీడియాను త్రిషను సంప్రదించగా ఆమె భిన్నంగా స్పందించింది.

గతంలోనే తాను ఈ చిత్రం నుంచి తప్పకున్నానని స్పష్టం చేశానని.. మరోసారి దీనిపై వివరణ ఇవ్వాల్సిన పని లేదని ఆమె అంటోంది. దీంతో సినిమా నుండి అర్ధంతరంగా తప్పుకొని తమని చాలా నష్టపరచిన త్రిషపై కఠిన చర్యలు తీసుకోవాలని శిబు నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేశాడట. మరి దీనిపై నడిఘర్ సంఘం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Saamy Square  త్రిష  సామీ స్క్వేర్  

Other Articles