CBFC Clarifies 300 Cuts for Padmavat | వామ్మో 300 కట్స్.. సెన్సార్ బోర్డు క్లారిటీ ఇచ్చింది

Cbfc chief on padmavat cuts

CBFC, Prasoon Joshi, Padmavat, Censor Cuts, Padmavat Rumours, CBFC Padmavat Cuts, Padmavat Censor Cuts, Karnisena Padmavat Issue

CBFC Chief Prasoon Joshi Clears The Air About 300 Cuts for Padmavat. "The makers have submitted the final film with agreed five modifications which have already been communicated and a U/A certificate has been given to the film. CBFC's process is complete and any further news about cuts is absolutely untrue. Let's refrain from utilising CBFC's name unnecessarily," he added.

పద్మావత్ కట్లపై స్పందించిన సెన్సార్ బోర్డు చీఫ్

Posted: 01/10/2018 11:15 AM IST
Cbfc chief on padmavat cuts

పేరులో చిన్న మార్పు, సీన్ల కట్లతో ఎట్ట‌కేల‌కు ప‌ద్మావ‌త్ విడుద‌లకాబోతుంది. రిలీజ్ డేట్ స్పష్టత కరువైనప్పటికీ.. ఎట్టకేలకు వివాదాల నుంచి సినిమా ఊరట పొందటంపై బాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఓ వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. సెన్సార్ బోర్డు సినిమాకు ఏకంగా 300ల క‌త్తిరింపులు చేసిందంటూ ఆ వార్తల సారాంశం.

ఈ వార్తను సీబీఎఫ్ సీ చైర్మ‌న్ ప్ర‌సూన్ జోషీ ఖండించారు. మీడియాలో వ‌స్తున్న 300ల క‌త్తిరింపుల క‌థ‌నాలు అవాస్త‌వ‌మ‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రాజ్‌పుత్‌లు, చ‌రిత్ర‌కారుల స‌ల‌హా క‌మిటీ మేర‌కు తాము ఐదు చిన్న స‌వ‌ర‌ణ‌లు మాత్ర‌మే చేసిన‌ట్లు ప్ర‌సూన్ పేర్కొన్నారు. స‌మాజ మ‌నోభావాల‌ను దృష్టిలో ఉంచుకుని అవ‌స‌ర‌మైన విధంగా సినిమాను ఎడిట్ చేసిన‌ట్లు తెలిపారు. ఇలాంటి వార్త‌లు ప్ర‌చారం చేసి సీబీఎఫ్‌సీ ప‌రువు తీయొద్ద‌ని ఆయ‌న కోరారు.

జ‌న‌వ‌రి 25న ఈ చిత్రం విడుద‌లకాబోతుందని చెప్పుకుంటుండగా.. మ‌రోవైపు సినిమా విడుద‌ల‌ను ఎలాగైనా అడ్డుకుంటామ‌ని, పెట్రోలు పోసుకుని మ‌రీ నిర‌స‌న‌లు, ఆందోళ‌నలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు క‌ర్ణిసేన ప్ర‌క‌టించింది. ఇంకోవైపు చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో విడుదల కాబోనివ్వమని రాజస్థాన్ ప్రభుత్వం మంకు పట్టుతో ఉంది.

ఇవి కూడా చదవండి.. పద్మావతిపై ప్రకాశ్ రాజ్ ఆవేదనబాలీవుడ్ లో మరో పద్మావతి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles