Telangana Govt Financial Aid to Senior Comedian | గుండుకు టీ ప్రభుత్వ సాయం.. కేటీఆర్ ట్వీట్

T govt support to gundu hanumantha rao

Telangana Government, Gundu Hanumantha Rao, kidney Related Issues, Minister KTR, Financial Assistance, CM Relief Fund, Mega Star Chiranjeevi

The government of Telangana has extended an aid of five lakh rupees for Gundu Hanumantha Rao from Chief Minister Relief Fund. The IT minister KTR has revealed the same on his social media account. Gundu Hanumantha Rao has been suffering some kidney related issues and was admitted to the hospital long back. He is undergoing the treatment at Appolo hospital. Very recently, Mega Star Chiranjeevi also extended his help for the actor and it is the time for the Telangana government to respond over the same and extend their support.

నటుడు గుండు హనుమంతరావుకు టీ సర్కార్ సాయం

Posted: 01/08/2018 05:29 PM IST
T govt support to gundu hanumantha rao

టాలీవుడ్ లో కొన్నాళ్ల క్రితం సీనియర్ నటులు గుండు హనుమంతరావు, పొట్టి వీరయ్యలు అనారోగ్యంతో బాధపడుతున్న కథనాలు రాగా.. మెగాస్టార్ చిరంజీవి వారికి ఆర్థిక సాయం మా ద్వారా అందించిన విషయం తెలిసిందే. తాజాగా హనుమంత రావుకి మరోసాయం అందింది.

సినిమాల్లో హాస్య‌పాత్ర‌లు వేసి అల‌రించిన గుండు హ‌నుమంత‌రావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించగా, చికిత్సకు అవసరమైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో గుండు హ‌నుమంత‌రావు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం ఐదు లక్షల రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆయనకు విడుదల చేసింది.

ఈ సందర్భంగా గుండు హనుమంత‌రావు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాన‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. కోలుకున్నాక కూడా ఆయనకు మరింత సహకారం అందిస్తామని కేటీఆర్ హామీనిచ్చారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles