Actress Breaks Silence on T Rajendar Controversy | స్టేజీపై ఏడ్చిపించటం.. పెదవి విప్పిన నటి ధన్సిక

Insulting issue actress fire on tr

Sai Dhanshika, Sai Dhanshika T Rajendar, Sai Dhanshika Controversy, Sai Dhanshika T Rajendar, Dhanshika About T Rajendar

Sai Dhanshika has finally broken her silence on the controversial incident involving actor T Rajendar during the 'Vizhithiru' film press meet held during the last week of September. No spiritual person would shout like that she added.

రాజేందర్ పై విరుచుకుపడ్డ నటి ధన్సిక

Posted: 11/16/2017 11:02 AM IST
Insulting issue actress fire on tr

కోలీవుడ్ సీనియర్ దర్శకనటుడు, శింబు తండ్రి టీ రాజేందర్ కొన్నాళ్ల క్రితం చేసిన ఓ వ్యవహారం పెను దుమారం రేపిన విషయం తెలసిందే. నటి సాయి ధన్సికపై విజిత్తిరు చిత్ర ఈవెంట్ లో వేదికపైనే మండిపడటం.. ఆపై ఆమె ఏడ్చేయటం చూశాం. సెప్టెంబర్ చివరి వారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ ఘటనపై ఇప్పడు ధన్సిక నోరు మెదిపింది. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజేందర్ పై మండిపడింది.  ‘‘రాజేందర్ గారు ఆధ్యాత్మిక భావన ఉన్న వ్యక్తి అని చాలా మంది చెబుతుంటారు. కానీ, ఆ లక్షణాలున్న వారు అలా పిచ్చిపట్టినట్లు అరవరు. నిజానికి నాకు షార్ట్ టెంపర్ చాలా ఎక్కువ. కానీ, ఆ సమయంలో మౌనంగా ఉండటమే మంచిది అనుకున్నా. అందుకే ఆయన తిడుతుంటే భరించి.. చివర్లో కన్నీటి పర్యంతం అయ్యా’’ అని ఆమె చెప్పింది.

ఆ ఘటన నుంచి బయటపడటానికి నాకు ఏడు రోజులు పట్టింది. మహిళలను ఇలాంటి వేధింపులు అన్ని రంగాల్లో ఎదుర్కుంటున్నారు. అలాగని అందరు మగాళ్లను నేను విమర్శించటం లేదు. ఇలాంటి సమయంలోనే వారిలో ఉన్న అసలు మనస్తత్వాలు ఏంటో బయటపడతాయి. అందుకే నేను వారికి కృతజ్నతలు తెలియజేస్తున్నా అని ధన్సిక చెప్పింది.

కాగా, స్టేజీపై ఉన్న తన పేరు ప్రస్తావించకపోవటంతో పెద్దలంటే గౌరవం లేదా అంటూ ధన్సిక పై టీ రాజేందర్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఆమె క్షమాపణలు చెబతున్నా వినకుండా... రజనీ పక్కన చేసినంత మాత్రానా(కబాలిలో కూతురు క్యారెక్టర్) తోపువి అయిపోతావా అంటూ ధన్సికపై ఓ రేంజ్ లోనే ఆయన విమర్శలు గుప్పించారు. ఈ ఘటన నటుడు విశాల్, ఆర్ బాలాజీ లు బహిరంగంగానే టీఆర్ ను తిట్టిపోశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles