Pullela Gopichand's biopic officially Announced | సైనా, సింధు గురువు గోపీచంద్ బయోపిక్.. అధికారిక ప్రకటన.. లీడ్ రోల్ ఎవరో?

Gopichand biopic announced

Pullela Gopichand, Pullela Gopichand Biopic, Fox Star Studio, Abundantia Entertainment, Fox Star Studio New Movie, Fox Star Studio Vikram Malhotra,

Ace Badminton Player Pullela Gopichand's Biopic Announced. Fox Star Studios and Vikram Malhotra collaborate for biopic. Cast and Crew Other Details Reveal Soon.

గోపీచంద్ బయోపిక్ అధికారిక ప్రకటన

Posted: 11/16/2017 10:25 AM IST
Gopichand biopic announced

టాలీవుడ్ లో కూడా బయోపిక్ పర్వం మొదలైన తరుణంలో స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఆత్మకథ కూడా ఆ మధ్య తెరపైకి వచ్చింది. సుధీర్ బాబు హీరోగా ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో ఈ చిత్రం ఉండబోతుందని చెప్పుకున్నాం.

అయితే ఏమైందో గానీ ఆ ప్రాజెక్టు డిలే అవుతూ వస్తోంది. కానీ, హఠాత్తుగా ఇప్పుడు గోపీచంద్ బయోపిక్ ను అనౌన్స్ చేసేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్డూడియో. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం ఉండబోతుందంట. బేబీ, ఎయిర్ లిఫ్ట్ చిత్రాలను నిర్మించిన అబుందంతియా ఎంటర్ టైన్ మెంట్స్ వారు సహ భాగస్వాములుగా తెరకెక్కబోతుంది. ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో గోపీచంద్ కూడా పాల్గొన్నారు. తన బయోపిక్ యువతకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

ఆయన కెరీర్ లోసాధించిన విజయాలు, సైనా, సింధులకు గురువుగా ఆయన అందించిన సేవలు.. అకాడమీ తదితర విషయాలు ఇందులో చూపించబోతున్నారంట. గురువారం గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం లాంఛ్ కాబోతుందని ఫాక్స్ స్టార్ ప్రకటించింది. అయితే ఈ ప్రాజెక్టులో ప్రవీణ్ గానీ, సుధీర్ బాబుగానీ ఉన్నారే లేదో విషయం పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే సైనా బయోపిక్ లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles