Line Clear for Game of Ayodhya Movie Release | కాంట్రవర్సీ మూవీకి లైన్ క్లియర్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Game of ayodhya movie release date

Game of Ayodhya, Sunil Singh, Babri Masjid Demolition Movie, Ayodhya Controversy Movie, Game of Ayodhya Movie

Game of Ayodhya Movie to release on November 24. Film based on the Babri Masjid demolition Directed by Sunil Singh.

గేమ్ ఆఫ్ అయోధ్య రిలీజ్ డేట్ వచ్చింది

Posted: 11/09/2017 12:45 PM IST
Game of ayodhya movie release date

బాలీవుడ్ లో మరో వివాదాస్పద చిత్రం రాబోతుంది. ‘గేమ్ ఆఫ్ అయోధ్య’ పేరిట బాబ్రీ మసీదు విధ్వంసం.. ఓ ప్రేమ కథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రైబ్యునల్ జోక్యంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

ఎవరికీ తెలియని, బయటకు రాని పలు విషయాలను ఈ సినిమా ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నట్టు దర్శకుడు సునీల్ సింగ్ తెలిపారు. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు తొలుత సెన్సార్ బోర్డు నిరాకరించింది. దేవాలయం-మసీదు వివాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం, బాబ్రీ వివాదం ఇంకా కొనసాగుతుండడంతో సర్టిఫికెట్ ఇచ్చేందుకు సీబీఎఫ్‌సీ నిరాకరించింది. మత విద్వేషాలను ఈ సినిమా రెచ్చగొట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నో చెప్పింది.

అయితే ఈ సినిమాను పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించామని, 1992లో ఆ దురదృష్టకరమైన రోజు అక్కడి వారి జీవితాలను ఎలా మార్చివేసిందో చెప్పే ప్రయత్నం చేశామని చెబుతూ సింగ్ ఫిల్మ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. అది ఓకే చెప్పడంతో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ‘గేమ్ ఆఫ్ అయోధ్య’లో సునీల్ సింగ్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించారు. ఈ నెల 24న సినిమా విడుదల కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles