Nag and RGV Movie Release date Fix | సరిగ్గా ఆరు నెలలకు సినిమా రిలీజ్

Nag varma movie release date

Nagarjuna, Ram Gopal Varma, RGV, Nagarjuna Release Date, RGV-Nag Movie, RGV-Nag Movie Release Date, April 20 Nag Varma Movie, Nag New Movie Release Date

Nagarjuna Akkineni-Ram Gopal Varma's next film release date locked. The Action Cop Thriller set date on April 20th.

నాగ్-వర్మ రిలీజ్ డేట్ ఫిక్స్?

Posted: 11/08/2017 11:41 AM IST
Nag varma movie release date

వరుసగా డిజాస్టర్లు.. పైగా వివాదాలు... అలాంటి దర్శకుడితో చాలా గ్యాప్ తర్వాత సినిమాకు ఓకే చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు కింగ్ నాగార్జున. అయితే శివ టైంలో కూడా తాను ఇలాంటి కామెంట్లే విన్నానని.. ఇప్పుడు కూడా వర్మ మ్యాజిక్ చేసి తీరతాడంటూ నాగ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఈ చిత్రం ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోబోతున్న విషయం తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకోబోతుందని నాగ్ ఇది వరకే చెప్పాడు. ఇందులో నాగ్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.

నాగ్ ఆ రిస్క్ చెయ్యడంట!

ఏప్రిల్ 20న చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత సిద్ధమైపోయినట్లు సమాచారం. వర్మ కంపెనీనే ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. ఈ చిత్ర మిగతా పాత్రల వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాతి వారమే భరత్ అను నేను.. నా పేరు సూర్య చిత్రాలు రిలీజ్ డేట్ లను అనౌన్స్ చేశాయి. ప్రస్తుతం వీరిలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles