Sunil about Hero Rajasekhar's Greatness | రాజశేఖర్ గొప్పతనం గురించి హీరో సునీల్

Rajasekhar save sunil daughter

Hero Sunil, Rajasekhar, PSV Gauda Vega Success Meet, Rajasekhar Treated Sunil Daughter, Rajasekhar Save Sunil Daughter Life, Hero Sunil Daughter, Sunil with Rajasekhar

Hero Sunil about Rajasekhar's Kindness. Once Rajasekhar treated his ill daughter and save her life Sunil said.

రాజశేఖర్ నా కూతురి ప్రాణాలు కాపాడారు

Posted: 11/08/2017 11:09 AM IST
Rajasekhar save sunil daughter

చాలా కాలం తర్వాత సీనియర్ హీరో రాజశేఖర్ గరుడ వేగతో మంచి హిట్ అందుకున్నాడు. అసలు సినిమాకు ఇంతలా ఆదరణ లభిస్తుందని తానూ ఊహించ లేదని.. చిరు, బాలయ్య ఇలా... టాలీవుడ్ మొత్తం తమకు అండగా నిలిచిందని పేర్కొంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రతీ ప్రెస్ మీట్ లో ఎంతో భావోద్వేగానికి లోనవుతూ వస్తున్నాడు. దీనిని బట్టి ఈ యాంగ్రీ మెన్ ఎంత సున్నిత మనస్కుడో అర్థం చేసుకోవచ్చు.

కానీ, ఆయన నిజంగా మనుసున్న ఓ మనిషని చెబుతున్నాడు కమెడియన్ కమ్ హీరో సునీల్. తాజాగా ఓ స్టార్ హోటల్ లో గరుడ వేగ టీం క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ఖు హాజరైన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి సునీల్ కూడా హాజరయ్యాడు. రాజశేఖర్ అంటే తనకి ఎంతో అభిమానమనీ, ఒక హీరోగానే కాదు మనసున్న మనిషిగా ఆయనని ఇష్టపడతానని చెప్పాడు. రియల్ లైఫ్ లోను ఆయన నాకెంతో హెల్ప్ చేశారు .. ఒకసారి నా కూతురికి బాగోలేనప్పుడు వైద్యం చేసి ప్రాణాలు కాపాడారని అన్నాడు. 'గరుడవేగ' సినిమా విజయవంతమైనందుకు రాజశేఖర్ కి అభినందనలు తెలియజేశాడు.రాజశేఖర్ టీమ్ తో కలిసి క్రిస్ మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.

ఇక ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సోమ, మంగళవారాల్లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. మరో వారం వసూళ్లు ఇలాగే వస్తే నిర్మాతలు ప్రాఫిట్ ను అందుకోవటం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles