యంగ్ టైగర్ టైంకే వస్తాడా? | Kalyan Ram Clarity on Jai Lava Kusa Release

Jai lava kusa release date not changed

Jai Lava Kusa, Jai Lava Kusa Release Date, Jai Lava Kusa September 21st, Fake News on Jai Lava Kusa

Jai Lava Kusa released on Same date. Movie not Postponed Kalyan Ram Clarity in Twitter. Lava Teaser also Coming Soon he added. The Movie Plan to Release on September 21st.

జై లవకుశ రిలీజ్ డేట్ మారలేదు

Posted: 08/14/2017 06:41 PM IST
Jai lava kusa release date not changed

ఓవైపు జై లుక్కు, టీజర్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, మిగతా రెండు లుక్కుల్లో ఎలా కనిపించబోతున్నాడో అని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. లవ ఫస్ట్ లుక్ తో కూడా క్లాస్ టచ్ ఇచ్చిన తారక్, టీజర్ ఎప్పుడు ఇస్తాడోనని వెయిట్ చేస్తున్నారు.

ఆపై కుశ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రావాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆడియో వేడుక, ప్రమోషన్ల హడావుడి షరా మాములే. ఈ లెక్కన సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం కాగా, పోస్ట్ పోన్ అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత కళ్యాణ్ రామ్ స్పందించాడు. నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ బ్యానర్ ఆర్ట్స్ ద్వారా ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

జై లవకుశ విషయంలో వస్తున్న వార్తలన్నీ వదంతులే. ముందుగా చెప్పిన తేదీ సెప్టెంబర్ 21న విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. త్వరలో లవ టీజర్ ను రిలీజ్ చేస్తాం అని వెల్లడించాడు. ఈ లెక్కన గాలి వార్తలకు పుల్ స్టాప్ పడినట్లయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Jai Lava Kusa  Release Date  

Other Articles

Today on Telugu Wishesh