వద్దంటున్నా విననివారు ఫ్యాన్స్ ఎలా అవుతారు? జనాల్లోకి వచ్చేవాడే నేత | Filmmaker Raising Doubts Against Pawan Security Reason

Tammareddy sensational comments on pawan and fans

Tammareddy Bharadwaja, Tammareddy Bharadwaja Sensational Comments, Tammareddy Bharadwaja Pawan Fans, Pawan Fans Not Real, Pawan Fans Fake, Tammareddy Controversy Comments on Pawan, Tammareddy Pawan Fans

Tammareddy Bharadwaja Sensational Comments on Pawan Kalyan Fans. They are not real fans. Pawanism is an absolute stupidity he said. Even Pawan also not control them,

పవన్ ఫ్యాన్స్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

Posted: 08/05/2017 01:18 PM IST
Tammareddy sensational comments on pawan and fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై టాలీవుడ్ మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడా? అసలు వాళ్లు నిజమైన అభిమానులేనా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నాడు. అందుకు పాత తరం నటుల అభిమానులను ఉదాహరిస్తున్నాడు.

రీసెంట్ గా పవన్ అమరావతి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తాను పాదయాత్ర లాంటిది చేద్దామన్న ఫ్యాన్స్ ఎగబడిపోయి అడ్డుకుంటారన్న ఉద్దేశ్యంతో ఆగాల్సి వస్తుందని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆలోచిస్తున్నానని చెప్పటం తెలిసిందే. దీనిపై భరద్వాజ స్పందించాడు. ఒకప్పుడు ఉండే ఫ్యాన్స్ ఇప్పుడు లేరని తెలిపాడు. పవన్ వద్దని వారిస్తున్నా ఆయనపైబడి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం, ప్రసంగించేప్పుడు అరవటం లాంటివి చేస్తున్నారన్నాడు. ఆ లెక్కన వారికి తమ అభిమాన హీరో అన్నా, అభిమాన నేత అన్నా గౌరవం లేన్నట్లుందని తెలిపాడు. అలాంటి అభిమానులు ఉంటే ఎంత ఉండకపోతే ఎంత అంటూ పేర్కొన్నాడు.

గతంలో రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులంతా(ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లు) ప్రజల్లోకి చొచ్చుకువెళ్లారని, అసలు నేత అంటేనే ప్రజల్లోకి వెళ్లేవాడని, తద్వారానే నిజమైన హీరోలుగా మారారని ఆయన గుర్తు చేశారు. పవన్ ఇప్పుడు భద్రత లేకుండా బయటకు వెళ్లరనే తాను అనుకుంటున్నానని, ఏవైనా తేడాలు చేస్తే, వారే అభిమానం పేరిట అడ్డుకుంటారని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఎప్పుడో ఒకసారి పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్తుండడం వల్లే ఎక్కువ మంది ఆయనను చూసేందుకు వస్తున్నారని, అదే పవన్ కల్యాణ్ ప్రతీ ఊరు వస్తారని తెలిస్తే ఎందుకు ఎగబడతారని అంటున్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Tammareddy Bharadwaja  Pawanism Concept  

Other Articles

Today on Telugu Wishesh