Khanna Hero says will never get married

Senior hero shocking answer on marriage

Akshaye Khanna, Akshay Khanna, Akshaye Khanna Marriage, Akshaye Khanna Solo Life, Akshaye Khanna New Movies, Akshaye Khanna No Marriage, Senior Hero Bachelor Life, Bollywood Rumours, Akshaye Khanna Affairs

Akshaye Khanna says he will never get married. Wanting to be single and has no belief on Relations.

పెళ్లి గురించి అడిగితే షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు

Posted: 07/11/2017 03:27 PM IST
Senior hero shocking answer on marriage

ఓ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అక్షయ్ ఖన్నా సోలోగా హిట్లు చాలానే అందించాడు. 'హిమాలయ్ పుత్ర' సినిమాతో 1997లో బాలీవుడ్ లో వినోద్ ఖన్నా వారసుడిగా అరంగేట్రం చేసిన అక్షయ్ 'తాళ్', 'బోర్డర్', 'మొహబ్బత్', 'కుద్రత్', 'దిల్ చహతాహై' వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్ గా ఒక వెలుగు వెలిగాడు. అయితే తర్వాత ఏమైందో తెలీదుగానీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి, మధ్య మధ్యలో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్య శ్రీదేవి మామ్ లో నెగటివ్ రోల్ తో ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం ప్రమోషన్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న అక్షయ్ నుంచి మీడియాకు ఊహించని సమాధానమే ఎదురైంది. 42 ఏళ్ల ఈ హీరో ఇంత వరకు పెళ్లి చేసుకోకపోవటం విశేషం. దీనిపై ఖన్నా మాట్లాడుతూ... తనకు వివాహం చేసుకోవాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశాడు. జీవితంలో అస్సలు వివాహం చేసుకోనని తేల్చిచెప్పాడు. తాను ఒంటరిగా జీవించేందుకు ఇష్టపడతానని అన్నాడు. వివాహం లేదా ప్రేమ తన జీవితంలోకి వచ్చినా దానిని కొనసాగించలేననేది తన బలమైన నమ్మకమని అక్షయ్ ఖన్నా తెలిపాడు.

వివాహ బంధాన్ని జీవితాంతం కొనసాగించడం అందరికీ సర్వసాధరణమైనదైనా తనకు మాత్రం వింతగా అనిపిస్తుందని చెప్పాడు. ఒకరితో బంధం కొనసాగించిన తరువాత నచ్చినప్పుడు విడిపోయి కొత్త వ్యక్తితో మరో బంధం ఏర్పర్చుకోవడం తనకు నచ్చుతుందని అక్షయ్ ఖన్నా చెప్పడంతో అంతా షాకైపోయారు. కాగా, అప్పట్లో ఐశ్వర్య రాయ్ తోపాటు రిమ్మీ సేన్, నేహ ధూఫియాలతో మనోడు అఫైర్ కొనసాగించినట్లు చాలానే వార్తలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshaye Khanna  Mariage  Bollywood Rumours  

Other Articles