Superstar Behavior on sets revealed

Samantha reveals mahesh secret

Samantha, Samantha Mahesh Babu, Samantha Mahesh Secret, Mahesh Behaviour on Sets, Samantha Shocking Comments on Mahesh, Mahesh Babu Comedy Timing on Sets, Mahesh Irritate on Sets, Samantha about Mahesh Irritation, Superstar Behavior on sets, Unknown Thing About Mahesh, Mahesh Babu Unknown Fact

Actress Samnatha Reveal Mahesh Babu Behaviour on sets. Sam stressed that it is almost impossible to not laugh when Mahesh is around.“That he’s the most entertaining company. I dare you to not laugh if he’s in the room,” she added.

మహేష్ లో మరో యాంగిల్ చెప్పేసిందిగా...

Posted: 07/11/2017 04:09 PM IST
Samantha reveals mahesh secret

తన కో హీరోయిన్ల పోటీగానీ, ఎలాంటి వైషమ్యాలు లేకుండా సరదాగా గడిపే నటి సమంత, క్లోజ్ బాండింగ్ మాత్రం చాలా తక్కువ మందితోనే మెయింటెన్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత మరి సెట్స్ లో ఎవరితో బాగా సన్నిహితంగా ఉంటుంది? అన్న డౌట్స్ ను తీరుస్తూ  ట్విట్టర్ లో టపీమని సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్పేసింది.

మహేష్ లో తెలియని క్వాలిటీ గురించి చెప్పమని ఓ అమ్మాయి ట్విట్టర్ లో కోరగా.. మహేశ్ బాబు సెట్స్ లో చాలా సరదాగా ఉంటాడనీ .. సందడి చేస్తాడని చెప్పింది. మహేష్ మాంచి టైమింగ్ తో జోకులు పేలుస్తుంటాడు. ఆయన షూటింగ్ అంటే చాలూ అందరిలో ఏదో తెలియని ఓ ఉత్సాహం వచ్చేస్తుంది. షూటింగ్ బ్రేక్ సమయంలో కో ఆర్టిస్ట్ లతో సరదాగా కబుర్లు చెప్పే మహేశ్ మంచి కంపెనీ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అయితే కెమెరా ముందుకు వెళ్లగానే మహేష్ టోటల్ గా మారిపోతాడని అంది.

ఆయన దృష్టంతా చేయబోయే సీన్ పైన .. నటనపైనే ఉంటుందని చెప్పింది. ఆ సమయంలో స్పాట్లో ఎవరూ మాట్లాడుకోవడం, నవ్వుకోవడం లాంటివి చేయకూడదు. చేస్తే మాత్రం ఆయన చిరాకు పడిపోతారంటూ చెప్పుకొచ్చింది. అన్నట్లు మహేష్ కూతురు సితార సమంతకు పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే కదా. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ స్పైడర్, భరత్ అను నేను తో బిజీగా ఉండగా, సమంత మెర్సిల్, రంగస్థలం 1985 షూటింగ్ లో పాల్గొంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Samantha  Tollywood News  

Other Articles