Taapsee fell in Love in childhood పడ్డానండీ ప్రేమలో మరి.. అంటున్న తాప్సీ

Dancing has been my first love taapsee pannu

Taapsee Loves Classical Dance, Actress Taapsee Loves Classical Dance, actress tapsee ponnu, actress tapsee, tapsee, tapsee ponnu, kollywood, bollywood, Naam Shabana

actress tapsee ponnu says she fell in love in her childhood, While she was sttuding third class she fell in love with classical dance.

పడ్డానండీ ప్రేమలో మరి.. అంటున్న తాప్సీ

Posted: 05/07/2017 09:47 AM IST
Dancing has been my first love taapsee pannu

కాలీవుడ్ నుంచి టాలీవుడ్, అటు నుంచి బాలీవుడ్ కు పయనమై.. అక్కడ కూడా తన సత్తాను చాటుకున్న నటి తాప్సీ పోన్ను.. ప్రేమలో పడింది. అవునండీ ఈ విషయాన్ని స్వయంగా తాప్సీయే చెప్పింది. అయితే అమె ప్రియుడు ఎవరు అని అడుగుతున్నారు కదూ. అయితే అక్కడే మీరు పప్పులో కాలేశారు. అమె ప్రేమలో పడింది మాత్రం వాస్తవం  కానీ వ్యక్తులతో కాదు. అమె మనస్సు దోచుకున్నది సంప్రదాయ నృత్యం.

హిందీలో బేబీ, పింక్, రన్నింగ్‌ షాది, ది ఘాజీ ఎటాక్‌ (త్రిభాషా చిత్రం) చిత్రాలు మంచి పేరే తెచ్చి పెట్టాయి. తాజాగా తెరపైకి వచ్చిన నామ్‌ షబానా చిత్రం నటిగా ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఇమేజ్ ను మరోస్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం తడ్కా, జుడ్వా 2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కాగా ప్రేమ గురించి తాప్సీని అడగ్గా.. తాను ఎనిమిదేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. అయితే అది మీరనుకునే ప్రేమ కాదని, తనకు నాట్యం అంటే వల్లమాలిన ప్రేమ అని, నాట్యాన్ని ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రేమిస్తున్నానని వివరించింది.

నాట్యమే తాను, తానే నాట్యం అని, నాట్యం లేకుండా తాప్సీ లేదని పేర్కొంది. అంతే కానీ, తాను ఇప్పటి వరకూ మనుషులనెవరని ప్రేమించలేదని చెప్పింది. చిత్ర పరిశ్రమలో హీరోలు, ఇతర సహనటీనటులతో ప్రేమగా ఉంటానని, అయితే అది వృత్తిపరమైన ప్రేమేనని చెప్పుకొచ్చింది. ఇక జీవితంలో తాను ప్రేమించింది ఒకే ఒకరినని అంది. అదీ తానేనని చెప్పింది. ఎస్‌ తానంటే తనకు చాలా ఇష్టం అని పేర్కొంది. ఇక నటిగా మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నానని తాప్సీ చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress  tapsee ponnu  Naam Shabana  kollywood  bollywood  

Other Articles